సెల్‌ఫోన్‌ ఈఎంఐ కట్టే విషయంలో గొడవ.. స్నేహితుడి హత్య | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ ఈఎంఐ కట్టే విషయంలో గొడవ.. స్నేహితుడి హత్య

Published Tue, May 9 2023 9:14 AM

- - Sakshi

తూర్పు గోదావరి: సెల్‌ఫోన్‌కు ఈఎంఐ కట్టే విషయంలో తలెత్తిన వివాదంలో స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని తన ఇంటిలోనే పూడ్చి పెట్టిన కేసులో లాకవరపు పవన్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్టు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్టు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం నడుపల్లికోట గ్రామానికి చెందిన మృతుడు కొడమంచిలి సురేంద్ర (25), లాకవరపు పవనన్‌కుమార్‌ స్నేహితులు. సురేంద్ర స్నేహితుడికి ఈఎంఐలో సెల్‌ఫోన్‌ ఇప్పించాడు.

రెండు వాయిదాలు కట్టిన తర్వాత సొమ్ము కట్టడం మానేశాడు. సురేంద్ర ఈ నెల 3వ తేదీన పవన్‌కుమార్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగటంతో ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటిలోనే గొయ్యితీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మూడు రోజులకు దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 6వ తేదీన పోలీసులు, తహసీల్దార్‌ సమక్షంలో తవ్వకాలు జరిపి మృతదేహానికి పంచనామా నిర్వహించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సురేంద్ర మృతికి కారణమైన పవన్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్టు సీఐ తెలిపారు. వేగంగా కేసు దర్యాప్తు చేసిన ఎస్‌ఐ ఎం.సూర్య భగవాన్‌ను, సిబ్బందిని సీఐ వెంకటేశ్వరరావు అభినందించారు.

 
Advertisement
 
Advertisement