బాలికపై అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు

Published Thu, May 9 2024 5:15 AM

-

ఏలూరు (టూటౌన్‌) : బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ పోక్సో అడిషనల్‌ డిస్ట్రిక్‌ సెషన్స్‌, స్పెషల్‌ కోర్టు స్పెషల్‌ జడ్జి, ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్‌ జడ్జి ఎస్‌.ఉమాసునంద బుధవారం తీర్పును వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి స్పెషల్‌ అడిషనల్‌ పీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్‌ స్టేషన్‌ పరిధిలోని బూరాయిగూడెంలో నాలుగో తరగతి చదువుతున్న నిందితుడి బంధువు, ఫిర్యాది స్నేహితురాలు స్కూల్‌లో 2016 జూన్‌ 18న ఫిర్యాది గాజులను తీసుకుంది. ఈ గాజుల కొరకు ఫిర్యాది నిందితుడి ఇంటికి వెళ్లగా స్నేహితురాలు గాజులు స్కూలులో ఇస్తానని చెప్పడంతో తిరిగి స్కూలుకు వెళుతుండగా నిందితుడు ఫిర్యాదిని పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. అక్కడ నుంచి తప్పించుకుని వచ్చిన ఫిర్యాది జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేయడంతో ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎంవీ సుభాష్‌ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు ఈ కేసుపై దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. దీనిపై విచారణ పూర్తి కావడంతో జడ్జి ఉమాసునంద ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన నిందితుడు మాటూరి భుజంగరావు అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో కోర్టు ఎదుట స్పెషల్‌ ఏపీపీ డీవీ రామాంజనేయులు బాధితుల తరుపున వాదనలు వినిపించారు. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్సై కె.రాజారెడ్డి కోర్టు కానిస్టేబుల్‌ డి.సురేంద్రబాబు, కోర్టు లైజనింగ్‌ అధికారులను ఎస్పీ డి.మేరీప్రశాంతి అభినందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement