ఆ యాపిల్‌ వాచ్‌ లేకపోతే ఆ ప్రయాణికుడి ప్రాణం గాల్లోనే..! | Sakshi
Sakshi News home page

అరువు తెచ్చుకున్న యాపిల్‌వాచ్‌ ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడింది!

Published Tue, Jan 23 2024 11:32 AM

Doctor Uses Flight Attendants Apple Watch Saves Plane Passanger Life - Sakshi

యాపిల్‌ వాచ్‌లో ఉండే ఆధునిక టెక్నాలజీతో ఎందరో ప్రాణాలను రక్షించుకున్నారు. దీనిలో ఉండే క్రాష్‌ డిటెక్షన్‌ కాల్ ఫీచర్‌ ఏదైన ప్రమాదం ఎదురైతే అందులో సేవ్‌ చేసిన సన్నిహితుల మొబైల్‌కి అలర్ట్‌ మెసేజ్‌ ఇవ్వడమే గాక లోకేషన్‌ని కూడా షేర్‌ చేస్తుంది. ఈ ఒక్క ఫీచర్‌తో అనుకోని ప్రమాదంలో చిక్కుకున్న ఎందరో ప్రాణాలను రక్షించుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆ యాపిల్‌ వాచ్‌లోని హెల్త్‌కి సంబంధించిన సరికొత్త ఫీచర్‌ సాయంతో ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించాడు ఓ డాక్టర్‌. 

అసలేం జరిగిందంటే..'రోజుకి ఒక యాపిల్‌ తింట్‌ డాక్టర్‌ని కలవాల్సిన పని ఉండదు" అన్నది పాత సామెత. మీ వద్ద యాపిల్‌ వాచ్‌ ఉంటే మీ ప్రాణాలు సేఫ్‌లో ఉన్నట్లే అనేది నేటి సామెత కాబోలు. ఏంటీది అనుకోకండి... ఎందుకంటే..ఆ యాపిల్‌ వాచే ప్రాణాపయా స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నుంచి ఇటలీలోని వెరోనాకు వెళ్తున్న ర్యాన్‌ ఎయిర్‌ విమానంలో చోటు చేసుకుంది. ఇగ్లాండ్‌లోని హియర్‌ఫోర్డ్‌ కౌంటీ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తున్న 43 ఏళ్ల వైద్యుడు ఆ ఉదంతాన్ని వివరించాడు.

తాను సరిగ్గా జనవరి 9న ఇంగ్లాండ్‌ నుంచి ఇటలీలోని వెరోనాకు ర్యాన్‌ ఎయిర్‌ విమానంలో బయలుదేరుతున్నప్పుడూ ఈ అనూహ్య ఘటన చేసుకుందన్నారు. ఓ 70 ఏళ్ల మహిళ సడెన్‌గా ఊపిరీ పీల్చుకోవడంలో ఇబ్బందుపడుతుంది. దీంతో వెంటనే విమానంలోని సిబ్బంది అప్రమత్తమై ఈ విమానంలో ఎవరైన డాక్టర్‌ ఉన్నారా? అని అడిగాడు. దీంతో తాను వెంటనే స్పందించినట్లు రియాజ్‌ తెలిపారు. ఆ తర్వాత తాను ఆ మహిళ పరిస్థితి చూడటమే గాక ఆమె గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగిగా గుర్తించాను. వెంటనే అక్కడే ఉన్న ఫ్లైట్‌ అటెండ్‌ యాపిల్‌ వాచ్‌ని అడిగి తీసుకున్నారు రియాజ్‌. ఆ వాచ్‌లో ఉన్న బ్లడ్‌ ఆక్సిజన్‌ యాప్‌ ఫీచర్‌ సాయంతో ఆ మహిళ శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలను చాలా  తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

వెంటనే విమానంలో ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉందా? అని విమాన సిబ్బందిని అడిగి దాన్ని వెంటనే ఆమెకు అమర్చడం జరిగింది. ఇటలీలో దిగే వరకు ఆ ఆక్సిజన్‌ సాయంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగారు రియాజ్‌. విమానం ఇటలీలో ల్యాండ్‌ అవ్వగానే ఆమె తక్షణ వైద్య సాయం అందించింది విమాన సిబ్బంది. ఆ మహిళ కూడా వెంటనే కోలుకోవడమే గాక ఆమె ప్రాణాపయ స్థితి నుంచి బయటపడిందన్నారు రియాజ్‌. ఒక రకంగా తనకు ఈ యాపిల్‌ గాడ్జెట్‌ని ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలనేది తెలిసిందన్నారు.

అలాగే ఈ రోజుల్లో ఇలాంటి ప్రాథమిక గాడ్జెట్‌లతో ఇలాంటి అత్యవరసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాలను రక్షించడానికి దాన్ని ఎలా వినియోగించుకోవాలనే ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందన్నారు రియాజ్‌. అరువు తెచ్చుకున్న యాపిల్‌వాచ్‌లోని ఈ ఫిచర్‌ ఒకరి ప్రాణాలను కాపాడిందన్నారు. ఇక్కడ బ్లడ్‌ ఆక్సిజన్‌ యాప్‌ ఓ రోగి ప్రాణం కాపాడటంలో అద్భుతమైన సహయకారిగా ఉపయోగిపడిందన్నారు రియాజ్‌. అయితే యాపిల్‌ కంపెనీ ఈ యాప్‌ విషయంలో మెడికల్‌ టెక్నాలజీ కంపెనీ అయిన మాసిమ్‌తో పేటెంట్‌ వివాదం ఎదుర్కొంటోంది. దీంతో యాపిల్‌ కంపెనీ తమ సీరిస్‌ 9 అల్ట్రా2 ఆపిల్‌ వాచ్‌లో బ్లడ్‌ ఆక్సిజన్‌ యాప్‌ ఉండదని గతవారమే వెల్లడించింది కూడా. 

(చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..)

Advertisement
 
Advertisement