పాన్‌ కేక్స్‌ నుంచి చికెన్‌ వరకు.. నిమిషాల్లో కుక్‌ అవుతాయ్‌ | Sakshi
Sakshi News home page

పాన్‌ కేక్స్‌ నుంచి చికెన్‌ వరకు.. నిమిషాల్లో కుక్‌ అవుతాయ్‌

Published Mon, Oct 2 2023 11:20 AM

Electric Steamer For Boiling Food Items - Sakshi

సౌకర్యవంతమైన మల్టీ కుక్‌వేర్‌ల సరసన చేరింది ఈ హార్డ్‌–బాయిల్డ్‌ స్టీమర్‌. ఇందులో వండివార్చుకోవడం భలే తేలిక. ఈ మెషిన్‌ లో గుడ్లు, జొన్నకండెలు, దుంపలు, కుడుములు వంటివన్నీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్స్, పాన్‌​ కేక్స్‌ వంటివీ వేసుకోవచ్చు. అలాగే చికెన్‌  వింగ్స్, చిల్లీ చికెన్, గ్రిల్డ్‌ ఫిష్, క్రిస్పీ ప్రాన్స్‌ ఇలా చాలానే చేసుకోవచ్చు.

కేక్స్, కట్లెట్స్‌ వంటివాటికీ పర్‌ఫెక్ట్‌ ఈ కుక్‌వేర్‌. దీని అడుగున, స్టీమింగ్‌ బౌల్‌లోనూ వాటర్‌ పోసుకుని.. ఎగ్‌ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్‌ని.. అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు. నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు.

వేగంగా, మంచిగా కుక్‌ అవ్వడానికి వీలుగా పెద్ద బౌల్‌ లాంటి మూత ఉంటుంది. దాంతో హోల్‌ చికెన్‌ వంటివీ కుక్‌ అవుతాయి. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్‌ స్విచ్‌ ఉంటుంది. కుకింగ్‌ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్‌  లైట్‌ వెలుగుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement