స్టార్‌ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్‌: బీటౌన్‌ స్టార్లు, క్రికెటర్ల సందడి | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్‌: బీటౌన్‌ స్టార్లు, క్రికెటర్ల సందడి

Published Sun, Jan 14 2024 1:10 PM

Ira Khan Reception Btown celebreties check video and photos viral - Sakshi

బాలీవుడ్‌  స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌  కుమార్తె  ఇరా ఖాన్‌, ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌  నూపుర్‌  శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్‌వేడుకలు, బారాత్‌, రిజిస్టర్‌ మ్యేరేజ్‌, ఆతరువాత  ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో సదడి  చేస్తున్నాయి. 

మాపెళ్లి మా ఇష్టం:
ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్‌ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్‌,  పట్టుచీరలు, నగల  హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్‌ఖాన్‌ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. 

పెళ్లి తరువాత  జైపూర్‌, ముంబై వేదికగా  ఇచ్చని రిసెప్షన్‌ వేడుకు కూడా టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి.  జైపూర్‌ వెళ్ల లేని వారు, ముంబైలో,  ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్‌లో ఈ రిసెప్షన్‌కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (ఎన్‌ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రీటీలు,  క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం  ఏక్‌నాథ్‌  షిండే  కూడా హాజరు  కావడం విశేషం.

ఇంకా  బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయంగా పేరొందిన షారుఖ్‌, సల్మాన్‌ ఇద్దరూ అమీర్‌ఖాన్‌తో  కలిసి సందడి చేశారు.  ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు  విచ్చేసి ఇరా, నూపుర్‌ జంటకు అభినందనలు తెలిపారు. 

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజరైనారు.  ఇంకా స్టార్‌ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, శిఖర్‌ ధావన్‌, ఆస్కార్‌ విజేత, సంగీత దర్శకుడు ఆర్‌ రెహ్మాన్‌ మరింత ఆకర్షణగా నిలిచారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement