కరాచీలో భారతీయ ఫుడ్‌ స్టాల్‌..నెటిజన్లు ఫిధా! | Kavita Didis Food Stall In Karachi Wins Heart, Blogger Shares Video Goes Viral | Sakshi
Sakshi News home page

కరాచీలో భారతీయ ఫుడ్‌ స్టాల్‌..నెటిజన్లు ఫిధా!

Published Sun, May 12 2024 3:42 PM

Kavita Didis Food Stall in Karachi Goes Viral

మన భారతీయ ఫుడ్‌ స్టాల్‌ దాయాది దేశమైన పాక్‌లో ఉంటే ఎవ్వరికైనా గర్వంగా ఉంటుంది. మాటిమాటికీ ఏదో ఒక విషయమైన మనతో కాలుదువ్వే దేశంలో సగర్వంగా ఓ భారతీయురాలు ఫుడ్‌ స్టాల్‌ నడుపుతూ..అక్కడ పాకిస్తానీయులకు మన భారతీయ వంటకాలను రుచి చూపుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో భారత్‌కు చెందిన కవితా దీదీ ఈ ఫుడ్‌ స్టాల్‌ని నడుపుతున్నట్లు కనిపించిది. ఈ స్టాల్‌ శాకాహారం, మాంసాహారం రెండింటిని అందిస్తుంది. ఓ పాకిస్తానీ బ్లాగార్‌ ఆమె ఫుడ్‌ స్టాల్‌కి సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ ఆమె ఫుడ్‌ స్టాల్‌ గురించి వివరించాడు. ఆ వీడియోలో అతడు కవిత ఆమె కుటుంబం అందిస్తున్న రుచికరమైన ఆహారాన్ని హైలెట్‌ చేశారు. ముంబైలో వడపావ్‌ ఫేమస్‌. ఇప్పుడూ కరాచీ వాసులు కూడా ఈ భారతీయ వంటకాన్ని ఇష్టపడుతున్నారని కవిత చెబుతున్నారు. 

ఇక ఈ పాకిస్తాన్‌ బ్లాగర్‌​ కూడా ఆ వంటకాన్ని రుచి చూసి మెచ్చుకున్నారు. ఇక్కడ కరాచీ ఆహార ప్రియులు తనను కవితా దీదీ అని అప్యాయంగా పిలుస్తారని కవితా ఆ వీడియో పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్‌ మాసంలో తమ స్టాల్‌ని నడపమని చెప్పడంతో ఖాన్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇతర దేశాల్లోని మతాల పట్ల కనబర్చిన గౌరవం అంకితభావానికి బ్లాగర్‌ ఖాన్‌ చాలా ఫిదా అయ్యారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం మా సోదరికి పాకిస్తానీయులందరూ మద్దతు ఇవ్వాలి అని రాశారు. మరొకరు పాక్‌లో భారతీయ వంటకానికి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తుల హెల్త్‌ సీక్రెట్స్‌తో యూస్‌ ఉండదట!)

 

Advertisement
 
Advertisement
 
Advertisement