మిస్‌ వరల్డ్‌: ఈ స్టన్నింగ్‌ ఇండియన్‌ బ్యూటీల గురించి తెలుసా?  | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌: ఈ స్టన్నింగ్‌ ఇండియన్‌ బ్యూటీల గురించి తెలుసా? 

Published Sat, Jan 20 2024 12:27 PM

Miss World Do you know these Stunning Indian winners beauties - Sakshi

అందరమూ కలలు కంటాం.  వాటిల్లో కొన్ని చాలా పెద్దవి,చాలా చిన్నవి. చిన్నదైనా  పెద్దదైనా ఆ కలను నేర్చుకునే పట్టుదల మాత్రం కొందరికే ఉంటుంది. కలలను సాకారం చేసుకునే అదృష్టం  కొంతమందికే సాధ్యం. అందులోనే చాలా ప్రత్యేకమైంది అయితే ఆ జర్నీ చాలా కష్టం.   ఇక, బ్యూటీ,  మోడలింగ్‌ రంగంలో అమ్మాయిలు రాణించాలంటే  నిజంతా అది కత్తి మీద సామే. అలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రపంచ సుందరీమణులుగా,విజేతలుగా నిలిచారు. ప్రపంచ వేదికల మీద మన దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టారు. తాజాగా  మిస్‌ వరల్డ్‌  2023 సంబరాలకు ఇండియా వేదిక  కానుంది. బ్యూటీ విత్‌ పర్పస్‌ థీమ్‌తో ఈ పోటీలు ఘనంగా నిర్వహించనుంది.  


 
ప్రతీ ఏడాది  వివిధ  దేశాల్లో  నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఈసారి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. దీంతో మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ సర్వత్రా చర్చనీయాంశంగా  మారింది. అంతర్జాతీయంగా  నిర్వహిస్తున్న  మిస్ వరల్డ్ పోటీలు  ఎపుడు నిర్వహించారో తెలుసా?

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ  1951లో ఈ పోటీలకు నాంది పలికారు. ఇంగ్లీషు టెలివిజన్‌  వ్యాఖ్యాత ఎరిక్ డగ్లస్ మోర్లీ మిస్ వరల్డ్ పోటీ , కమ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టారు. 1978ల ఆయన  నిష్క్రమించడంతో అతని  భార్య   బ్యూటీ క్వీన్‌  జూలియా మిస్ వరల్డ్‌ పోటీలను  కొనసాగించింది.  82 ఏళ్ల వయసులో మోర్లీ 2000లో మరణించాడు. అతని భార్య, జూలియా మోర్లీ ఛైర్మన్‌గా ఉండగా కుమారుడు స్టీవ్ డగ్లస్ దాని సమర్పకులలో ఒకరుగా ఉన్నారు. లండన్‌లోని లైసియం బాల్‌రూమ్‌లో తొలి మిస్ వరల్డ్ టైటిల్‌ను మిస్ స్వీడన్, కికీ హాకోన్సన్ కైవసం చేసుకుంది.  మన ముద్దుగుమ్మలు తమ అందానికి, సంకల్పాన్ని, తెలివితేటల్ని, జోడించి ఆరు సార్లు జగజ్జేతలుగా నిలిచారు. 

రీటా ఫారియా
రీటా ఫారియా పావెల్  ఒక డాక్టర్‌. మోడలింగ్‌ రంగంలో రాణిస్తూ  1966లో  మిస్ వరల్డ్   పోటీల్లో చరిత్ర సృష్టించింది. తొలి  ఆసియా , భారతీయ మిస్ వరల్డ్ విజేతగా  నిలిచి బ్యూటీ రంగంలో ఇండియాలో పేరును సమున్నతంగా నిలిపింది.  మరియు ముంబైలో గోవా తల్లిదండ్రులకు జన్మించింది. వైద్య శిక్షణ పొందిన తొలి మిస్ వరల్డ్ విజేత ఆమె. ఏడాది పాటు మిస్ వరల్డ్‌గా  ఉన్న ఆమె సినిమా  ఆఫర్లను తిరస్కరించి  వైద్య వృత్తికి అంకితమైంది. 1971లో, తన గురువు డేవిడ్ పావెల్‌ను వివాహం చేసుకుంది. 

ఐశ్వర్య రాయ్:  ప్రపంచంలోనే  అందాలరాణిగా నిలిచిన  ఐశ్వర్య రాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. 1994 మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకుని యూత్‌ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్‌లో  స్టార్‌ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది.  రెండు ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌లతో సహా వివిధ అవార్డులును దక్కించుకుంది. అలాగే 2009లో భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని ,2012లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆర్డర్‌ డెస్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్‌ను  గెల్చుకుంది. 

డయానా హేడెన్: మోడల్, నటి   డయానా హేడెన్ 1997లో మిస్ వరల్డ్  కిరీటాన్ని  దక్కించుకుంది.మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయ మహిళ. అంతేకాదు ఈ పోటీల్లో  మూడు సబ్‌ టైటిల్స్‌ను గెల్చుకున్న ఏకైక మిస్ వరల్డ్ కూడా

యుక్తా ముఖి:  మిస్‌ ఇండియాగా నిలిచిన నాల్గో  భామ  యుక్తా ఇంద్రలాల్ ముఖి.  1999లో  మిస్ వరల్డ్  టైటిల్‌తోపాటు  1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని  కూడా సొంతం చేసుకుంది.   మోడల్‌గాను, కొన్ని హిందీ సినిమాల్లోనూ కనిపించింది. 

ప్రియాంక చోప్రా : 2000లో  మిస్ వరల్డ్ 2000 విజేత  ప్రియాంక చోప్రా, మోడల్‌గా, హీరోయిన్‌గా రాణిస్తోంది. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న  హీరోయిన్లలో ఒకరిగా తన సత్తాను చాటుకుంటోంది.   రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు గౌరవాలను గెలుచుకుంది. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వరించింది. అలాగే ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది.

మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను  నటి , మోడల్ మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె తన సొంత రాష్ట్రం హర్యానాకు ప్రతినిధిగా పోటీ పడి,  గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారతీయురాలిగా నిలిచింది. చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్‌లో సంయోగిత పాత్రతో ఆమె తొలిసారిగా నటించింది. 

Advertisement
Advertisement