Pomegranate Peel Tea దానిమ్మ తొక్కల టీ, అద్భుత ప్రయోజనాలు | Sakshi
Sakshi News home page

దానిమ్మ తొక్కలతో టీ, అద్భుత ప్రయోజనాలు

Published Fri, Feb 23 2024 4:10 PM

Pomegranate peels have these amazing benefits - Sakshi

#PomegranatePeelTea దానిమ్మ గింజలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడేవారికి దానిమ్మ గింజల జ్యూస్‌ బాగా ఉపయోగడపతాయి. అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రెగ్యులర్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

దానిమ్మ తొక్కల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుతో దానిమ్మ తొక్కలతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాడీలోని మలినాల్ని బైటికి పంపించేందుకు, జలుబు  దగ్గు,  చర్మ సమస్యలు, జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు  ఇంకా మధుమేహం, రక్తపోటు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా  హెల్ప్‌ చేస్తుంది. 

దానిమ్మ తొక్కల టీ తయారీ: దానిమ్మ కాయనుంచి వలిచిన తొక్కల్ని శుభ్రంగా  కడిగి తొక్కలను ఎండబెట్టాలి. ఇతర సందర్భాల్లో, మైక్రోవేవ్ ఉపయోగించి వేడి చేయవచ్చు. ఆ తరువాత, పీల్స్ బాగా చూర్ణం చేయాలి. దీన్ని తడి లేని సీసాలో  నిల్వ ఉంచుకోవచ్చు. ఒక కప్పు నీటినిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. దీన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా  తేనె  కలుపుకొని  తాగాలి. ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
బాడీ డీటాక్సిఫై: విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని నెగిటివ్‌ టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన దంతాలు: దానిమ్మ తొక్కలతో  తయారు చేసిన టీ తాగడం వల్ల చిగుళ్లు, దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది: దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది. పేగు   ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. 

కాబోయే తల్లులకూ మేలు 
చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదట. ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణం పాలీఫెనోలిక్ సమ్మేళనాలు ఫోలిక్ యాసిడ్ , విటమిన్ సీ ఎదుగుతున్న పిండానికి సరైన పోషకాహారాన్ని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది.   ఇంకా పిగ్మెంటేషన్‌,  జుట్టు రాలడం సమస్య ఉన్నవారు కూడా  దానిమ్మతొక్కల టీని సేవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement