చిత్రకళలో సధాకర్‌కు రజతం | Sakshi
Sakshi News home page

చిత్రకళలో సధాకర్‌కు రజతం

Published Tue, May 7 2024 6:20 AM

-

నయీంనగర్‌ : రంగ్‌–2023 సంవత్సరానికి సంబంధించి 2వ జాతీయ స్థాయి ఆర్ట్‌–ఫెర్ఫామెన్స్‌ కాంపిటీషన్‌లో హనుమకొండ తేజస్వి ఉన్నత పాఠశాల చిత్రకళా బోధకుడు పానుగంటి సధాకర్‌ రజత పథకం సాధించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్‌ కల్చరల్‌ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ముంబాయిలో ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌ చిత్రకళ పోటీలు నిర్వహించారు. ‘75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశం’ అనే అంశంపై చిత్రాన్ని పోస్ట్‌ ద్వారా కాంపిటీషన్‌కు పంపగా 40 నుంచి 60 ఏండ్ల కేటగిరీలో సధాకర్‌ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. నిర్వాహకులు రజత పతకం, ప్రశంసా పత్రాన్ని పంపించారు. సోమవారం తేజస్వి విద్యా సంస్థల చైర్మన్‌ రేవూరి జన్నారెడ్డి రజత పతకం, ప్రశంస పత్రం అందజేసి సధాకర్‌ను అభినందించారు. ప్రిన్సిపాల్‌ సంధ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement