మంచు పాన్పు | Sakshi
Sakshi News home page

మంచు పాన్పు

Published Fri, Feb 9 2024 4:34 AM

Poignant picture of sleeping polar bear wins Wildlife Photographer of the Year Peoples Choice Award - Sakshi

చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్‌బర్గ్‌పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ నీమా సరిఖానీ తీశారు.

ఈ ఫొటో.. పీపుల్స్‌ ఛాయిస్‌ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్‌ ఛాయిస్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్‌ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఈ ఫొటోను తీశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement