‘ఆ జాబితాలో చాట్‌ జీపీటి టాప్‌.. ఇండియా నుంచి ఏడు’ | Sakshi
Sakshi News home page

‘ఆ జాబితాలో చాట్‌ జీపీటి టాప్‌.. ఇండియా నుంచి ఏడు’

Published Wed, Dec 6 2023 3:23 PM

Wikipedia most popular articles of 2023: placed indias Seven Article - Sakshi

సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్‌ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్‌ గణాంకాలను రిలీజ్‌ చేసింది.

విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్‌ పేజ్‌ వ్యూస్‌ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్‌ జీపీటీ  మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్‌ ప్రపంచ కప్‌(3వ స్థానం), ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (4వ స్థానం), హాలీవడ్‌ సినిమా ఓపెన్ హైమర్‌ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్‌ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం).

ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి.

ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్‌ 28 వరకు మాత్రమేనని వికీపీడియా  ఫౌండేషన్‌ పేర్కొంది. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టాప్‌ 5లో చోటు సంపాదించటం విశేషం.  అదే విధంగా షారుక్‌ఖాన్‌ నటించిన జవాన్‌, పఠాన్‌  బాలీవుడ్‌ సినిమాలు రెండు టాప్‌ టెన్‌లో నిలిచాయి.

Advertisement
 
Advertisement