హైదరాబాద్ నుంచి కారులో తరలిస్తుండగా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్న పోలీసులు
జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బంధువు ఒకరు ఎటువంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి కారులో తీసుకువస్తున్న రూ.68.40 లక్షల నగదును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఏపీ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు లభించింది.
దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వా«దీనం చేసుకొని, చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు తెస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్సీకి దగ్గరి బంధువుగా చెబుతున్నారు. ఆయన బెట్టింగ్‌లకు బుకీ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తారని, ఆ డబ్బంతా ఎన్నికల ఫలితాలపై పందేలు కట్టిన వారి నుంచి వసూలు చేసి తెస్తున్నదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment