Vehicle inspection
-
టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బంధువు ఒకరు ఎటువంటి పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి కారులో తీసుకువస్తున్న రూ.68.40 లక్షల నగదును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఏపీ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు లభించింది.దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదును స్వా«దీనం చేసుకొని, చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు తెస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్సీకి దగ్గరి బంధువుగా చెబుతున్నారు. ఆయన బెట్టింగ్‌లకు బుకీ (మధ్యవర్తి)గా వ్యవహరిస్తారని, ఆ డబ్బంతా ఎన్నికల ఫలితాలపై పందేలు కట్టిన వారి నుంచి వసూలు చేసి తెస్తున్నదని సమాచారం. -
రూ.5.79 కోట్ల నగదు 16.6 కేజీల పసిడి
మియాపూర్/బన్సీలాల్ పేట్/కరీంనగర్ క్రైం/మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో సుమారు రూ.5.79 కోట్ల నగదు, 16.646 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా రోడ్డులో ఉన్న మై హోమ్ జ్యువెల్ ఎదురుగా అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీచేశారు. ఆ వాహనంలో బషీర్‌బాగ్‌కు చెందిన కిలుముళ్ల అనిరుధ్ (23), బాలిరాం అక్కే మారుతి, మూసాపేట్‌కు చెందిన శంకర్దుబే ఆరు బాక్సుల్లో బంగారం, వెండి ఆభరణాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద సంబంధిత పత్రాలు లేకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనంలో ఉన్న 16.64 కేజీల బంగారు ఆభరణాలు, 23.58 కేజీల వెండి ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నట్లు మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. మరో ఘటనలో మియాపూర్‌లోని ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద బాచుపల్లికి చెందిన రాజుకుమార్ ద్విచక్రవాహనాన్ని తనిఖీచేయగా అతని వద్ద రూ.14,93,100 నగదు ఉన్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు అతని వద్ద లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కవాడిగూడ, కరీంనగర్లో.. కవాడిగూడలో గాం«దీనగర్, టాస్‌్కఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో 2.09 కోట్ల నగదు పట్టుబడింది. గాంధీనగర్ పోలీ సు స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద కియా సెల్టోస్ కారు, సుజుకీ యాక్సెస్ ద్విచక్రవాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఈ నగదును సీజ్ చేసినట్లు టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి చెప్పారు. కరీంనగర్ టూ టౌన్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా రైటర్ సేఫ్ గార్డ్ కంపెనీకి చెందిన వాహనంలో రూ.2,36, 48,494 అక్రమ నగదును జప్తు చేసినట్లు కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిపిన తనిఖీల్లో పోలీ సులు రూ.1.19 కోట్ల నగదును సీజ్ చేశారు. వారంలో రూ.109 కోట్లు స్వాదీనం: సీఈఓ వికాస్‌రాజ్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి న నాటి నుంచి వారం రోజుల్లో జప్తు చేసుకున్న మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.100 కోట్లకు మించిపోయింది. ఇప్పటివరకు జప్తు చేసి న నగదు రూ.58.96 కోట్లకు చేరింది. సోమ వారం రూ.17.16 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర ఖరీదైన ఆభరణాలను సీజ్ చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.33.62 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.67 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కు క్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు సీజ్ చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.6.89 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఆభరణాలు, ఇతర వస్తువుల విలువ రూ.109.11 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రూ.77 లక్షలు విలువ చేసే 6,974 లీటర్ల మద్యం, 625 కేజీల బెల్లం పట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ రూ.6.64 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.51 లక్షలు విలువ చేసే 110 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు సీజ్ చేసిన మొత్తం గంజాయి విలువ రూ.2.97 కోట్లకు చేరింది. -
క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా!
సాక్షి, కామారెడ్డి: ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అక్రమ దందా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి ప్రాంతం నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా అవుతోంది. సోమవారం జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. చింతామణి ప్రాంతంలో ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి లారీల్లో బెంగళూరు–నాగ్‌పూర్ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. ఈనెల 19న లారీలో క్యాట్‌ఫిష్ తరలిస్తున్న ముఠా.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో లారీలో నీటిని నింపుకోవడానికి యత్నించింది. ఈ సందర్భంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానం వచ్చి లారీపై కప్పిన కవర్‌ను విప్పి చూశారు. అవి ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్ అని తేలింది. దీంతో మత్స్యశాఖ అధికారులు జేసీబీని తెప్పించి పెద్ద గుంతను తవ్వి లారీలో ఉన్న దాదాపు నాలుగు టన్నుల క్యాట్‌ఫిష్‌ను పారబోయించి పూడ్చి వేశారు. వీటి విలువ రూ. 2 లక్షలపైనే ఉంటుందని అంచనా. ‘క్యాట్‌ఫిష్’ వెనుక మాఫియా క్యాట్‌ఫిష్ ఉత్పత్తి, పెంపకం, రవాణా, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఫిష్‌ను తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా వెనుక పెద్ద మాఫియా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా క్యాట్‌ఫిష్‌ను స్వాధీనం చేసుకుని పూడ్చివేయించిన పోలీసులు.. డ్రైవర్ మీద మాత్రమే కేసు నమోదు చేశారు. క్యాట్‌ఫిష్ రవాణా నేరం క్యాట్‌ఫిష్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. క్యాట్‌ఫిష్‌ను పెంచినా, అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. జాతీయ రహదారిపై పోలీసులు లారీని పట్టుకుని మాకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి పరిశీలించాం. అవి క్యాట్‌ఫిష్ అని తేలడంతో వాటిని గుంతలో వేసి, పూడ్చి వేయించాం. –పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి -
ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
♦ కానిస్టేబుల్‌ను ఢీకొట్టబోయి ఆగిన లారీ ♦ ఆగ్రహించిన ట్రాఫిక్ ఎస్సై ♦ లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదిన వైనం సిరిసిల్ల టౌన్: లాఠీ కోసం రోడ్డుపైకి హఠాత్తుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఢీకొనకుండా ఒక్కసారిగా బ్రేక్‌వేసి ప్రాణాపాయం నుంచి రక్షించిన ఓ లారీ డ్రైవర్‌ను అభినందించాల్సింది పోయి ట్రాఫిక్ ఎస్సై.. ఆగ్రహంతో ఊగిపోయారు. తన లాఠీతో 15 నిమిషాలపాటు డ్రైవర్‌ను చితకబాదారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. ప్రజలు చూస్తుండగానే అతడిని తీవ్రంగా కొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఎస్సై లింగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇరుకైన ఆ రోడ్డుగుండా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వారిని ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించారు. భయపడిన ఆ యువకులు బైక్‌ను ఆపకుండా వెళ్లారు. దీంతో డిస్ట్రిక్ట్ గార్డు షబ్బీర్ ఆగ్రహంతో లాఠీని వారిపైకి విసిరినా.. వారు తప్పించుకుపోయారు. అదే సమయంలో టీఎస్16 యూబీ 1012 నంబరు గల లారీ అటుగా వస్తోంది. ఆ లారీని చూడకుండా షబ్బీర్ రోడ్డుపై పడిన లాఠీని తీసుకునేందుకు వంగారు. ఎదురుగా వాహనాలు ఉండడంతో లారీ డ్రైవర్ మోహన్ సైతం షబ్బీర్‌ను గమనించలేకపోయాడు. స్థానికుల అరుపుతో మోహన్ అప్రమత్తమై సడన్ బ్రేక్‌తో లారీని ఆపాడు. అప్పటికే షబ్బీర్ లారీని గుర్తించి క్షణాల్లో రోడ్డుపైకి పడుకోవడంతో, లారీ కిందకు చొచ్చుకుపోయినా అదృష్టవశాత్తు బతికిపోయాడు. అయితే, కానిస్టేబుల్ చనిపోయాడని భావించిన మోహన్ పారిపోతుండగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. అంతే.. ఇక ఎస్సై లింగమూర్తి వచ్చి ఆ డ్రైవర్‌ను నానాబూతులు తిడుతూ, కాలితో తన్నుతూ, లాఠీతో చితక్కొట్టారు. ఈయనకు మరో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు జత కలిశారు. పోలీసులపైకే లారీ తీసుకొస్తావా? అని ఊగిపోతూ 15 నిమిషాలపాటు ఆ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి జీపులోకి ఎక్కించి, ఠాణాకు తరలించారు. -
నోట్ల మార్పిడి ముఠాల అరెస్ట్
సూర్యాపేట: నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న రెండు ముఠాలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఎస్పీ జె.పరిమళ హననూతన్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలోని మమత లాడ్జి వద్ద పది మంది నోట్ల మార్పిడి చేసేందుకు రావడంతో దాడి చేసి పట్టుకు న్నామని చెప్పారు. అరికట్ల జోజీ రెడ్డి, నర్మల నాసరయ్య, ఈమని రవీంద్రా రెడ్డిl(గుంటూరు), తీపిరెడ్డి శ్రీనివాసులు(నె ల్లూరు), నర్రెడ్డి శివప్రసాద్‌రెడ్డి(కడప), కోలా శ్రీనివాస రెడ్డి(హైదరాబాద్), తుపా కుల శ్రీనివాస్, బొమ్మారెడ్డి శేషిరెడ్డి(ప్రకా శం)లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17.80 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వాహనాల తనిఖీలో.. జనగాం క్రాస్‌రోడ్డులో శనివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఏడుగురు వ్యక్తులు అనుమా నాస్పదంగా కనిపించారని ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ.12 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. రూ.7 లక్షల కొత్త నోట్లు పట్టివేత నల్లగొండ క్రైం: కమీషన్ పై కొత్త నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని నల్లగొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నార్కట్‌పల్లికి చెందిన చిక్కుల్ల వెంకన్న, తన సోదరుడు రమేశ్‌తో కలసి రూ.7 లక్షల నగదును తీసుకుని నల్లగొండలో ఉన్న వాళ్ల బాబాయ్ ఉప్పునూతల యాదయ్యకు అం దించేందుకు ఆటోలో వస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని మర్రిగూడ బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా కొత్త కరెన్సీ బయటపడింది. -
62 కిలోల వెండి స్వాధీనం
చిన్నమండెం(సంబేపల్లె) : కడప-చిత్తూరు జాతీయ రహదారిలో సంబేపల్లె మండలం దేవపట్ల మిట్టమీద ఆదివారం ఉదయం వాహనాల తనిఖీలో భాగంగా 62 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రుష్యేంద్రబాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆదివారం ఉదయం దేవపట్ల మిట్టమీద వాహనాల తనిఖీలో భాగంగా తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి ప్రొద్దుటూరుకు వెళుతున్న కారును సోదా చేశారు. అందులోని వ్యక్తులను విచారించగా తొలుత అరకిలో మేర కాళ్లకు వేసుకునే వెండి గొలుసులు చూపించారు. అనుమానం రావడంతో కారులో తనిఖీ చే యగా 62 కిలోల వెండి దొరికింది. విషయం తెలుసుకున్న రాయచోటి రూరల్‌సీఐ రాజేంద్రప్రసాద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని స్వాధీనం చేసుకున్న వెండిని సీజ్ చేశారు. వాటికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో మురుగేష్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి బిల్లులు అందజేయకపోతే సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులకు వెండిని అప్పగిస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు రాజగోపాల్, మోహన్, అమీర్ పాల్గొన్నారు.