సూర్యాపేట: నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న రెండు ముఠాలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఎస్పీ జె.పరిమళ హననూతన్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలోని మమత లాడ్జి వద్ద పది మంది నోట్ల మార్పిడి చేసేందుకు రావడంతో దాడి చేసి పట్టుకు న్నామని చెప్పారు. అరికట్ల జోజీ రెడ్డి, నర్మల నాసరయ్య, ఈమని రవీంద్రా రెడ్డిl(గుంటూరు), తీపిరెడ్డి శ్రీనివాసులు(నె ల్లూరు), నర్రెడ్డి శివప్రసాద్‌రెడ్డి(కడప), కోలా శ్రీనివాస రెడ్డి(హైదరాబాద్), తుపా కుల శ్రీనివాస్, బొమ్మారెడ్డి శేషిరెడ్డి(ప్రకా శం)లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17.80 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.
వాహనాల తనిఖీలో..
జనగాం క్రాస్‌రోడ్డులో శనివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఏడుగురు వ్యక్తులు అనుమా నాస్పదంగా కనిపించారని ఎస్పీ తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ.12 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
రూ.7 లక్షల కొత్త నోట్లు పట్టివేత
నల్లగొండ క్రైం: కమీషన్ పై కొత్త నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని నల్లగొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నార్కట్‌పల్లికి చెందిన చిక్కుల్ల వెంకన్న, తన సోదరుడు రమేశ్‌తో కలసి రూ.7 లక్షల నగదును తీసుకుని నల్లగొండలో ఉన్న వాళ్ల బాబాయ్ ఉప్పునూతల యాదయ్యకు అం దించేందుకు ఆటోలో వస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని మర్రిగూడ బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా కొత్త కరెన్సీ బయటపడింది.
నోట్ల మార్పిడి ముఠాల అరెస్ట్
Published Mon, Dec 19 2016 2:37 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement
Advertisement