అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత

Published Thu, May 9 2024 8:20 AM

అక్రమ

నందిగామ: అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను బుధవారం నందిగామ ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు తెలిపిన సమాచారం ప్రకారం పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో తెలంగాణకు చెందిన 200 కేసుల (9,600) మద్యం సీసాలు నిల్వ చేశారు. దాని విలువ రూ.12.48 లక్షలు ఉంటుందని ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎవరు తీసుకొచ్చారు.. అనే అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు కోటేశ్వరరావు తెలిపారు.

ఘంటసాల: మద్యం అక్రమంగా నిల్వచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొవ్వ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ వి.శివరామరాజు అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నారని సీఐ శివరామరాజుకు విశ్వసనీయ సమాచారం అందింది. అడిషనల్‌ ఎస్పీ జి.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ కృష్ణా జిల్లా ఈఎస్‌ జి.గంగాధరరావు, ఏఈఎస్‌ జి.పాండురంగారావు పర్యవేక్షణలో బుధవారం ఎస్‌ఈబీ సిబ్బంది దాడి చేశారు. ఆరు కేసులు 180మి.లీ. పరిమాణం కలిగిన రూ.42,400 విలువైన 288 మద్యం సీసాలు కలిగిన మూడు మూటలను స్వాధీనం చేసుకుని విక్రయదారుడైన భీమ వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. అతన్ని మొవ్వ జెఎఫ్‌సీఎం కోర్డు మెజిస్ట్రేట్‌ పి.రాజన్‌ ఉదయ్‌ ప్రకాష్‌ ముందు హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. దాడుల్లో వీఆర్వో తోట రవికుమార్‌, ఎస్‌ఈబీ స్టేషన్‌ ఎస్‌ఐ పి.హేమ సుస్మిత, హెచ్‌సీ పి.రంగబాబు, సిబ్బంది రాజ్‌కుమార్‌, అహ్మద్‌, గోపీనాథ్‌, ఎకై ్సజ్‌ ఎస్‌ఐ సుభాని, హెచ్‌సీ డి.రామకృష్ణ పాల్గొన్నారు.

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత
1/1

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత

Advertisement

తప్పక చదవండి

Advertisement