ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి? | Legendary Actress Devika Daughter Present Life Story And Her Photos Goes Viral - Sakshi
Sakshi News home page

తల్లి మరణంతో ఒంటరి జీవితం.. ఆ కారణంతో పెళ్లికి కూడా దూరం

Published Fri, Apr 19 2024 1:00 PM

Legendary Actress Devika Daughter Present life - Sakshi

హీరోయిన్‌ కనక..  తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుకు మని మనమరాలు.  లెజెండరీ హీరోయిన్‌ దేవికకు ఏకైక కూతురు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దేవిక చివరిగా నటించారు. 2002లో ఆమె మరణించారు. అప్పటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న ఆమె కూతురు కనక ఒక్కసారిగా డీలా పడిపోయారు.  ఆ సమయం వరకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో కనక నటించింది.

సూపర్ స్టార్ రజనీకాంత్, కార్తీక్, ప్రభు, మోహన్‌లాల్, మమ్ముట్టి, జయరామ్, రాజేంద్ర ప్రసాద్‌, భాను చందర్‌ వంటి స్టార్స్‌తో పలు సినిమాల్లో కనిపించిన ఆమె లెక్కలేనన్ని బ్లాక్‌ బస్టర్‌ విజయాలను కూడా అందుకుంది. కానీ తల్లి మరణం తర్వాత కనీసం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. చివరకు వివాహం కూడా చేసుకోకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఒంటరి జీవితాన్ని ఇప్పటి వరకు గడుపుతుంది.


(కనిక- దేవిక)

80,90 దశకంలో కనకకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ చిత్ర సీమలో ఆమె చెరగని ముద్ర వేశారు. తల్లి దేవిక మరణం తర్వాత ఆమె ఒంటరి అయిపోయారు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆమెను ఎవరో పెళ్లి చేసుకుని వదిలేశారని వార్తలు వచ్చాయి. బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె.. వీటిని పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ ఇంటి నుంచి బయటకు వచ్చే కనకకు అటెండర్ ఒక్కరే ఉంటారని కొందరు చెబుతున్న మాట. ఇప్పటి వరకు కనక ఏకాంతంగానే గడుపుతుండగా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని కొందరిలో ప్రశ్న మొదలైంది.

కనక గురించి కొందరు సీనియర్‌ జర్నలిస్ట్‌లు చెబుతున్న ప్రకారం.. ఆమె అప్పట్లోనే బీఏ చదివారని.. తల్లితో పాటుగా సినిమా షూటింగ్స్‌ వెళ్తున్న క్రమంలో వారి కుటుంబానికి రామచంద్రన్‌ అనే వ్యక్తి దగ్గర కావడం జరిగిందని చెబుతారు. అతనే ఆ కుటుంబానికి అండగా ఉంటూ వారిద్దరి మంచిచెడులు చూసేవాడని సమాచారం. కొంత కాలానికి కనక ప్రేమలో పడిన రామచంద్రన్‌ ఆ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు.  అయితే ఓ దశలో రామచంద్రన్‌ను కనక అపార్థం చేసుకుందని దీంతో వారిద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల అతన్ని ఇంటి నుంచి  కనక పంపేసినట్లు చెబుతున్నారు.

కొన్ని సంవత్సరాల తరువాత తల్లి మరణం ఆపై రామచంద్రన్ కూడా మరణించడం జరిగిపోయాయి. రామచంద్రన్ మరణం తర్వాత తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో కనకకు తెలిసింది. దీంతో గుండెలవిసేలా రోదించిన కనక.. తనకు సినిమాలేవీ అక్కర్లేదని, ఒంటరిగా జైలు జీవితాన్ని కోరుకున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కనకను సంప్రదించిన కోలీవుడ్‌ ప్రముఖ జర్నలిస్ట్‌ కుట్టి పద్మిని ఒక కాఫీ షాప్‌లో కలిశారు. పదేళ్లపాటు బయటిప్రపంచంలో కనక కనిపించకపోవడంతో అందరూ చనిపోయిందని అనుకున్నారు. ఏకంగా ప్రముఖ పత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి.  

దీంతో కొందరు మీడియా వారు ఆమె ఇంటికెళ్లేసరికి అక్కడ ఎదురుగా కనక కనిపించారు. తాను బతికేవున్నానని, వదంతులకు వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. అలా తల్లి మరణం తర్వాత కనక జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 41 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగానే ఒక పాత ఇంటిలో జీవిస్తుంది.

Advertisement
Advertisement