సమంత ఫోటోలు వైరల్‌.. కొన్ని గంటల్లోనే 20 లక్షలకు పైగా లైక్స్‌ | Sakshi
Sakshi News home page

బికినీలో సమంత.. సోషల్‌ మీడియాను ఊపేస్తున్న ఫోటోలు

Published Sat, Feb 24 2024 7:24 AM

Samantha In Bikini Photos Goes To Viral - Sakshi

అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సమంత.. త్వరలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది. ఇంతలోనే బికినీలో ఉన్న ఫోటోలను ఆమె షేర్‌ చేసి అందరికీ మరింత షాక్‌ ఇచ్చింది. ఇప్పుడా ఫోటోలు షోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి.

ప్రస్తుతం మలేషియాలో ఉన్న సమంత అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పుడూ తన ఫ్యాన్స్‌తో పలు ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే సమంత తాజాగా విడుద‌ల చేసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ర‌చ్చ‌నే లేపుతున్నాయి. ఇప్పటి వరకు 10 మిలియిన్స్‌ ప్రేక్షకులు చూసిన ఈ ఫోటోలకు సుమారు 25 లక్షల వరకు లైక్స్‌ వచ్చాయి. బికినీలో ఉన్న సామ్‌ను చూసి ఫ్యాన్స్ కామెంట్స్‌తో నింపేస్తున్నారు.

(ఇదీ చదవండి: రాత్రి అయితే చాలు వాళ్ల ఫోన్‌ కాల్స్‌తో భయమేస్తుంది.. కిరణ్‌ రాథోడ్‌ ఆవేదన)

నిజానికి సమంత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్‌ తీసుకుంటుంది. అందుకే ఆమె మరింత ఫిట్‌గా ఉంటుంది. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ సమంత విషయంలో వయసు తగ్గుతుంది. అదెలాగంటే మెటబాలిక్‌ ప్రకారం ఆమె ఏజ్‌ 23 మాత్రమే అంటూ షాక్‌ ఇచ్చింది. బరువు 50 కేజీలు మాత్రమే ఉన్నట్లు ఒక స్లిప్‌తో పోస్ట్‌ పెట్టింది.

Advertisement
Advertisement