రన్‌ టైమ్‌ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? | Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao: రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. రెండు రోజు వసూళ్లు ఎంతంటే?

Published Sun, Oct 22 2023 4:59 PM

Tiger Nageswararao Two days Collections World wide In Crores - Sakshi

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్‌గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. 

(ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్)

ఈ మూవీ రన్‌టైమ్‌ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు  రూ. 5.50 కోట్ల షేర్‌.. దేశవ్యాప్తంగా  అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్​ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్​ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్​ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?)

Advertisement
 
Advertisement
 
Advertisement