వరుణ్‌ తేజ్‌ సినిమాకు అలాంటి టాక్‌.. నెటిజన్లు ఏమంటున్నారంటే? | Varun Tej Gandeevadhari Arjuna Twitter Review in Telugu - Sakshi
Sakshi News home page

Gandeevadhari Arjuna Twitter Review: వరుణ్‌ తేజ్‌ సినిమాకు షాకింగ్‌ టాక్‌.. ఫస్టాఫ్‌ కన్నా సెకండాఫ్‌..

Published Fri, Aug 25 2023 9:06 AM

Varun Tej Gandeevadhari Arjuna Twitter Review - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాండీవధారి అర్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. నేడు(ఆగస్టు 25) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే చాలాచోట్ల షో పడటంతో ట్విటర్‌ వేదికగా జనాలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉంది? ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంది? అనే విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఓసారి వారి అభిప్రాయాలను చూసేద్దాం..

సినిమాను చాలా స్టైలిష్‌గా తీశారు. కానీ అంతగా వర్కవుట్‌ కాలేదు. చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. మరికొందరేమో థియేటర్‌లో ఉన్నవాళ్లంతా పారిపోండిరా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగున్నాయట. ప్రవీణ్‌ సత్తారు ఈసారైనా మంచి సినిమా తీస్తాడనుకుంటే నిరాశపర్చాడని చెప్తున్నారు. ట్విటర్‌లో ఎక్కువగా నెగెటివ్‌ టాకే నడుస్తోంది. మరి సినిమా భవిష్యత్తు ఏంటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ అర్థం కాదు.

చదవండి: Jabardasth Comedian Nava Sandeep: జబర్దస్త్‌ కమెడియన్‌ అరెస్ట్‌

 
Advertisement
 
Advertisement