కల నిజమైంది  | Sakshi
Sakshi News home page

కల నిజమైంది

Published Mon, Mar 18 2024 12:48 AM

Vishal Planning for Sequel Of Detective - Sakshi

హీరో విశాల్‌ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్‌’). మిస్కిన్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్‌ 2’ను ప్లాన్  చేశారు విశాల్‌. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి మిస్కిన్  తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్‌ 2’ కోసం విశాల్‌ దర్శకుడిగా మారారు.

‘‘డైరెక్టర్‌ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్  2’. ఈ సినిమా కోసం లండన్  వెళ్తున్నాను. అజర్‌బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు విశాల్‌. ఇక విశాల్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘రత్నం’ ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement