తెలంగాణకు ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో నిఖార్సైన కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాలలో (ఏపీ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ముగ్గురు) బీజేపీ కార్యకర్తలకు మంత్రి పదవి దక్కడం బీజేపీ సిద్ధాంత బలానికి నిదర్శనమని అన్నారు.
వారసత్వ రాజకీయ బలం లేకున్నా సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడ్డామన్న కిషన్ రెడ్డి..తెలంగాణలో స్వతంత్రంగా 8 స్థానాలు సాధించామన్నారు. 36 శాతం ఓట్లతో బీజేపీలో కొత్త చరిత్ర సృష్టించాం. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కష్టపడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. మోదీ సారధ్యంలో రాబోయే రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ
మరోవైపు తొలిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టిన ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో పని చేస్తున్నాను.ప్రతి కార్యకర్త నా విజయం కోసం పనిచేశారు.కష్టపడి పనిచేసే కార్యకర్తకు తప్పనిసరిగా అవకాశం వస్తుందనే దానికి నేను నిదర్శనం. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment