వందలాది కోట్లతో అభివృద్ధి పనులు.. | Sakshi
Sakshi News home page

వందలాది కోట్లతో అభివృద్ధి పనులు..

Published Thu, May 9 2024 3:50 AM

-

నేను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశా. మెటల్‌ రోడ్లను తారు రోడ్లగా మార్చేందుకు రూ.778 కోట్లు మంజూరు చేయించాను. దేవరకద్ర–కృష్ణా లైన్‌ పనులు మూడు దశాబ్దాలుగా నత్తనడకన సాగాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచి పూర్తి చేశాం. దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిచేయించాం. మహబూబ్‌నగర్‌–చించోళి జాతీయ రహదారి మంజూరుకు నావంతు కృషి చేశా. జాతీయ రహదారుల డివిజన్‌ కార్యాలయాన్ని పాలమూరుకు తీసుకొచ్చాం. ఐదేళ్లలో ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ.25 కోట్లు వచ్చాయి. రెండేళ్లు కరోనా కాలం కాగా.. రూ.10 కోట్లు కోవిడ్‌ కట్టడికి కేంద్రమే వినియోగించింది. ఇవి పోనూ రూ.15 కోట్లతో లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్లు, పాఠశాలల భవనాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాం.

Advertisement
 
Advertisement
 
Advertisement