నిర్మల్‌ | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sat, Apr 20 2024 1:30 AM

- - Sakshi

విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి

అల్లంపల్లి జీయర్‌ గురుకులం విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి సూచించారు.

శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

8లోu

22న ఆదిలాబాద్‌కు

సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌కు హాజరు

కైలాస్‌నగర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సుగుణ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.

భైంసాటౌన్‌: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. జీరో టికెట్‌తో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. దాదాపు అన్ని డిపోల్లోనూ ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో)శాతం 87–88 వరకు నమోదవుతోంది. దీంతో సంస్థకు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రతీ డిపో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయం సాధించేలా ‘లక్షే లక్ష్యం’ అనే చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైంసా, నిర్మల్‌ డిపోల్లో డిప్యూటీ ఆర్‌ఎం ప్రణీత్‌ లక్షే లక్ష్యం కార్యక్రమం ఉద్దేశంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతీ స్టేజీలో ప్రయాణికులను పిలిచి ఎక్కించుకోవాలని సూచించారు.

రీజియన్‌కు రూ.ఆరు లక్షలు టార్గెట్‌..

ఆర్టీసీ ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, ఉట్నూర్‌, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. రీజియన్‌ పరిధిలో ప్రస్తుతం సరాసరి 88 శాతం ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) నమోదవుతోంది. దీనిని 92 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం అన్ని డిపోలకు కలిపి రోజుకు రూ.135.78 లక్షలు ఆదాయం వస్తుండగా, దీనిని రూ.141.80 లక్షలకు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష చొప్పున అదనపు ఆదాయం సాధించాలని టార్గెట్‌ విధించారు. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఓఆర్‌, రెవెన్యూపరంగా నిర్మల్‌ డిపో ముందు నిలుస్తోంది. ప్రస్తుతం 92 శాతం ఓఆర్‌ వస్తుండగా, రోజుకు రూ.34.92 లక్షల ఆదాయం చేకూరుతోంది. అత్యల్పంగా ఉట్నూర్‌ డిపో 86 శాతం ఓఆర్‌ వస్తుండగా, రోజుకు రూ.6.42 లక్షల ఆదాయం వస్తోంది. దీంతో డిపో సామర్థ్యాన్ని బట్టి టార్గెట్‌ విధించారు.

ఆదాయం సరే.. సర్వీసులేవి..

ఇదిలా ఉండగా, మహాలక్ష్మి పథకంతో ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బస్సులు లేని రూట్లలో మినహా, చాలా రూట్లలో ప్రైవేట్‌ వాహనాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఈ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆదాయంపై దృష్టి పెట్టిన సంస్థ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల కోరుతున్నారు. ప్రస్తుతం రీజియన్‌ పరిధిలో రద్దీ వేళల్లో కొన్ని ట్రిప్పులకు ఓఆర్‌ శాతం 107 వరకు ఉంటోంది. కొన్ని ట్రిప్పుల్లో 60–80 శాతం ఉంటోంది. దీంతో సరాసరి 88 శాతం ఉంటోంది. గతంతో పోలిస్తే ఓఆర్‌ శాతం మెరుగుపడింది. రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని 534 సర్వే నంబర్‌లో అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించారని దానిని కాపాడామని తెలిపారు. అందరికీ ఉపయోగపడేలా అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్‌, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేశ్‌, కత్తి నవీన్‌, దామ భూమేశ్‌, దేవి రవి, అరుణ్‌, సప్పల రవి, సేపూరి సిద్ధార్థ, మణికంఠ, నిమ్మ గణేశ్‌, బి.రాజు ఉన్నారు.

అదనపు ఆదాయానికి ప్రణాళిక

ఓఆర్‌ పెంపునకు కసరత్తు

ఆర్టీసీలో కొత్త చాలెంజ్‌కు శ్రీకారం

ఆదిలాబాద్‌ రీజియన్‌లో డిపోలవారీగా లక్ష్యం ఇలా...

డిపో ప్రస్తుతం లక్ష్యం

ఓఆర్‌ రోజువారీ ఆదాయం ఓఆర్‌ రోజువారీ ఆదాయం

ఆదిలాబాద్‌ 87 రూ.28.46 91 రూ.29.76

భైంసా 87 రూ.13.79 89 రూ.14.12

నిర్మల్‌ 92 రూ.34.92 97 రూ.36.62

ఉట్నూర్‌ 86 రూ.06.42 90 రూ.06.71

ఆసిఫాబాద్‌ 88 రూ.18.67 92 రూ.19.50

మంచిర్యాల 88 రూ.33.50 92 రూ.35.07

రీజియన్‌ 88 రూ.135.78 92 రూ.141.80

ప్రయాణికులకు చేరువయ్యేందుకు...

ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థ ఆదాయం పెంచుకునే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష అదనంగా ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో లక్షే లక్ష్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంపై డిపోల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాం.

– ప్రణీత్‌, డిప్యూటీ ఆర్‌ఎం, ఆదిలాబాద్‌

భైంసా డిపోలో లక్షే లక్ష్యంపై ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ ఆర్‌ఎం ప్రణీత్‌(ఫైల్‌)
1/2

భైంసా డిపోలో లక్షే లక్ష్యంపై ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ ఆర్‌ఎం ప్రణీత్‌(ఫైల్‌)

2/2

Advertisement
Advertisement