ఆ టెక్నాలజీతో జాగ్రత్త!.. మంత్రులను హెచ్చరించిన మోదీ | Sakshi
Sakshi News home page

ఆ టెక్నాలజీతో జాగ్రత్త!.. మంత్రులను హెచ్చరించిన మోదీ

Published Mon, Mar 4 2024 5:12 PM

PM Modi Warning To Ministers On Deepfake - Sakshi

భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' నిన్న ఢిల్లీలో జరిగిన మంత్రి మండలి చివరి అధికారిక సమావేశానికి అధ్యక్షత వహించి సుమారు గంటసేపు ప్రసంగిస్తూ.. కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వివాదాలకు దూరంగా ఉండాలని, డీప్‌ఫేక్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రులకు సూచించారు. ఏదైనా ప్రకటనలు చేసే ముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రత్యర్థులు ఎంత దారుణానికైనా ఒడిగడతారని మోదీ వెల్లడించారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ మళ్లీ యూపీలోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ బరిలోకి దిగారు.

వాస్తవాలను వక్రీకరించే దిశలో కొందరు డీప్‌ఫేక్ టెక్నాలజీ వాడతారని డీప్‌ఫేక్‌ల సమస్యను గురించి మోదీ వివరించారు. గతంలో కూడా దీని గురించి వెల్లడిస్తూ.. ఏఐ రూపొందించిన ఫోటోలు, వీడియోలు నిజమైనవిగా కనిపిస్తాయని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ తాను గార్బా చేస్తున్నట్లు చూపించిన వీడియో అని వెల్లడించారు.

ఇదీ చదవండి: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. భవిష్యత్ వెల్లడించిన మోదీ

Advertisement
 
Advertisement
 
Advertisement