అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఖరారుపై సీడబ్ల్యూసీ మీటింగ్‌.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం

Published Wed, Oct 18 2023 1:47 PM

Rajasthan Polls Sachin Pilot Not Invited To CWC Meeting - Sakshi

జైపూర్: రాజస్థాన్‌ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్‌ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది.

ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సుఖ్‌జీందర్‌ రాంధావా, రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ గోవింద్‌ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాజస్థాన్‌ స్క్రీనింగ్‌ కమిటీ చీఫ్‌ గౌరవ్‌ గొగోయ్‌ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు.

రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్‌ గవర్నెన్స్ రాజస్థాన్‌లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే.    

ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?


 

Advertisement
 
Advertisement
 
Advertisement