అద్దంకి సిద్ధం సభకు ఎన్ని ప్రత్యేకతలో తెలుసా? | Sakshi
Sakshi News home page

అద్దంకి సిద్ధం సభకు ఎన్నో ప్రత్యేకతలున్నాయ్‌!.. ఏంటో తెలుసా?

Published Sun, Mar 10 2024 4:36 PM

YSRCP Siddham Sabha In Bapatla All You Need To Know About - Sakshi

సాక్షి, బాపట్ల: రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి 'సిద్ధం' సభ హోరెత్తుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అ‍త్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో.. చివరి క్యాడర్‌ సమావేశం ఇది. ఈ సమావేశానికి బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి మొత్తం ఆరు జిల్లాల (మొత్తం 43 నియోజక వర్గాలు) నుంచి ఏకంగా 15 లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా.

బాపట్ల ఈవెంట్‌లో ప్రత్యేకత ఏమిటంటే.. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం పై నుంచి చూస్తే 'వై' లాగా కనిపించే ర్యాంప్, సీఎం జగన్ యుద్ధ నినాదం 'వై నాట్ 175' అని మధ్యలో రాసి ఉంది.

హీలియం బెలూన్‌లు, సిద్ధమ్ కటౌట్‌లు, జెండాలు, ఆటో బ్రాండింగ్, బైక్ బ్రాండింగ్ వంటి బ్రాండింగ్ కార్యకలాపాలు, వేదిక స్థలంలో ఎక్కువ మంది సీఎం జగన్‌ ప్రసంగం వీక్షించేలా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. 'సిద్ధం' స్టాంపుల వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

  • ఇప్పటికే వైఎస్సార్‌సీపీ మూడు సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి.
  • జనవరి 27న భీమిలిలో జరిగిన మొదటి సభకు 3 లక్షల కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. 
  • ఫిబ్రవరి 3న ఏలూరులో జరిగిన రెండో సభకు 6 లక్షల మంది హాజరయ్యారు. 
  • ఆ తరువాత ఫిబ్రవరి 18న అనంతపురం సభకు 10 లక్షల మంది (1 మిలియన్) హాజరై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా 'మేం సిద్దం' అనే పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇందులో 'జగనన్న కనెక్ట్స్' ద్వారా వారి పేరుతో ఫ్రీ సిద్దం పోస్టర్‌ను రూపొందించుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ వెబ్‌సైట్ ద్వారా 4,00,00లకు పైగా ప్రత్యేక పోస్టర్లు క్రియేట్ చేసుకున్నారు.

సరికొత్త ప్రచారం 'నా కల'
ఇక పొతే ఏపీలో వైఎస్సార్‌సీపీ కొత్త క్యాంపెయిన్‌ 'నా కల'కు శ్రీకారం చుట్టింది. అద్దంకి సిద్ధం సభ వేదికపై సీఎం జగన్‌ ఈ కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నా కల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ.

Advertisement
 
Advertisement