అదేనా అయ్యర్‌ చేసిన తప్పు? శ్రేయస్‌ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా? | Sakshi
Sakshi News home page

#Shreyas Iyer: అదేనా అయ్యర్‌ చేసిన తప్పు? శ్రేయస్‌ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?

Published Thu, Feb 29 2024 10:25 AM

Heres why Shreyas Iyer dropped from BCCIs central contract - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌.. గత కొంత కాలంగా టీమిండియా మిడిలార్డర్‌లో నిలకడకు పెట్టింది పేరు. మూడు ఫార్మాట్లలో మిడిలార్డర్‌లో విరాట్‌ కోహ్లి తర్వాత అంతటి సత్తా ఉన్న ఆటగాడిగా అయ్యర్‌ పేరొందాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో అయ్యర్‌ ది కీలక పాత్ర. వరల్డ్‌కప్‌ హిస్టరీలోనే సింగిల్‌ ఎడిషన్‌లో 500పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు అ‍య్యరే.

2022 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా ఈ ముంబైకర్ కొనసాగుతున్నాడు. అటువంటి అయ్యర్‌ ఇప్పుడు ఏకంగా ఎందుకు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది? భారత క్రికెట్‌ బోర్డు సరైన నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నలు సగటు అభిమానిలో రేకెత్తుతున్నాయి. 

అదేనా అయ్యర్‌ చేసిన తప్పు?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రేయస్‌ అయ్యర్‌ భాగమయ్యాడు. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ముంబైకర్‌ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. అనంతరం ఆఖరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా శ్రేయస్‌కు చోటు దక్కలేదు.

అయితే అతడి వెన్ను గాయం తిరగబెట్టిందని అందుకే సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. అయ్యర్‌ కూడా వైజాగ్‌ టెస్టు అనంతరం నేరుగా బెంగళూరులోని ఏన్సీఏకు వెళ్లిపోయాడు. కానీ ఫామ్‌ లేమి కారణంగానే అయ్యర్‌ను పక్కన పెట్టారని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

అయితే సరిగ్గా ఇదే సమయంలో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లందరూ టీండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2023-24  క్వార్టర్స్‌లో ఆడాలని ముంబై క్రికెట్‌ ఆసోషియేషన్‌ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్‌ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు.

అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్‌ ఫిట్‌నెస్‌గా ఉన్నట్లు  ఏన్సీఏ సర్టిఫికెట్‌ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్‌ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ అతడిని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించేందుకు సిద్దమైందని పలు రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే అయ్యర్‌పై బీసీసీఐ వేటు వేయడం గమనార్హం.

బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందా?
అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్‌-బిలో ఉన్న ఆటగాడిని ఒక్కసారిగా తప్పించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ.. ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడి పట్ల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

ఒకవేళ అతడికి పన్మిషెంట్‌ ఇవ్వాలనకుంటే గ్రేడ్‌-సి డిమోషన్‌ చేయవలసిందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు తరపున అయ్యర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ల వీడియోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మరి కొంత మంది అయ్యర్‌ 100 శాతం ఫిట్‌నెస్‌గా లేడని అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా అయ్యర్‌తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.
చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం..!?

Advertisement
Advertisement