India Vs Australia 1st ODI: Check Here Probable Playing XI Pitch Weather Condition - Sakshi
Sakshi News home page

Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్‌ ఎలా ఉందంటే!

Published Fri, Mar 17 2023 7:22 AM

Ind Vs Aus 1st ODI: Probable Playing XI Pitch Weather Condition - Sakshi

India vs Australia, 1st ODI: హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్‌ శుక్రవారం (మార్చి 17) ఆరంభం కానుంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కాగా పాండ్యా చేతికి పగ్గాలు వచ్చాయి. ఈ క్రమంలో భారత్‌కు వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ నిలువనున్నాడు.

మరోవైపు..  ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో ఆసీస్‌ సారథిగా స్టీవ్‌ స్మిత్‌ వ్యవహరించనున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి ముందు ఈ సిరీస్‌ ఇరు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. బలాబలాల అంచనా, వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా తుది జట్టు కూర్పు తదితర అంశాలపై మేనేజ్‌మెంట్లు దృష్టి సారించనున్నాయి. ఇక ఇప్పటికే సొంతగడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ గెలిచి ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023ని రోహిత్‌ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

విజయం పరిపూర్ణం చేయాలని
ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ గెలుపొంది విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఇదిలా ఉంటే.. భారత మిడిలార్డర్‌ స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడటం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ రజత్‌ పాటిదార్‌ వైపు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.

పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్య.. వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఆడిన 20 వన్డే మ్యాచ్‌లలో సూర్య చేసిన పరుగులు 433. అత్యధిక స్కోరు 64. ఇక రోహిత్‌ జట్టులో లేకపోవడంతో ఇషాన్‌ కిషన్‌కు చోటు ఖాయం కాగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ సహా పేస్‌ విభాగంలో పాండ్యాతో పాటు శార్దూల్‌, సిరాజ్‌, షమీలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. 

తుది జట్లు (అంచనా)  
భారత్‌: శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ / రజత్‌ పటిదార్, కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్, మహ్మద్‌ షమీ.  

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్, ట్రావిస్‌ హెడ్, మార్నస్‌ లబుషేన్‌, షాన్‌ మార్ష్ / మార్కస్‌ స్టొయినిస్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్, మిచెల్‌ స్టార్క్, ఆడం జంపా, నాథన్‌ ఎల్లిస్‌. 

పిచ్, వాతావరణం 
మొదటి నుంచీ వాంఖెడేమైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్ల కు అవకాశం ఉంది. ఛేదన ఇంకా సులు వు కాబట్టి గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు. ఇరు జట్ల మధ్య ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌ (2020)లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో వార్నర్, ఫించ్‌ మెరుపు సెంచరీలు చేశారు. 

చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్‌ ఆశలు సజీవం
ICC WC Qualifier: డక్‌వర్త్‌ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌కు అర్హత

Advertisement
 
Advertisement
 
Advertisement