భారత్‌-కెనడా మ్యాచ్‌ వర్షార్పణం.. | T20 World Cup 2024 India Vs Canada Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌-కెనడా మ్యాచ్‌ వర్షార్పణం..

Published Sat, Jun 15 2024 7:48 PM | Last Updated on Sat, Jun 15 2024 9:19 PM

 T20 World Cup 2024 india vs canada live updates and highlights

India vs canada live updates: 

భారత్‌-కెనడా మ్యాచ్‌ వర్షార్పణం..

టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్‌-కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. 
 వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్‌ పడకుండానే ఈ మ్యాచ్‌ వర్షార్పణమైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. అయితే ఇప్పటికే భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడి..
భారత్‌-కెనడా మ్యాచ్‌ టాస్‌ మరింత ఆలస్యం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడి మారింది. గ్రౌండ్‌ స్టాప్‌ మైదానాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 09:00 గంటలకు అంపైర్‌లు పిచ్‌ను పరిశీలించనున్నారు.

టాస్‌ ఆలస్యం..
టీ20 వరల్డ్‌కప్‌-2024 గ్రూపు-ఎలో భాగంగా ఫ్లోరిడా వేదికగా భారత్‌-కెనడా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌ జరిగే ఫ్లోరిడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. స్టేడియం ఔట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. ఈ క్రమంలో  భారత కాలమానం ప్రకారం 07:30 గంటలకు పడాల్సిన టాస్‌ ఆలస్యం కానుంది. 

ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీలో భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.

ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మరోవైపు కెనడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement