IPL 2022: Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Head to Head Records - Sakshi
Sakshi News home page

IPL 2022: కేకేఆర్‌ను ఢీకొట్టనున్న సన్‌రైజర్స్‌.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Published Fri, Apr 15 2022 4:25 PM

IPL 2022: SRH VS KKR Head To Head Records - Sakshi

KKR VS SRH: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న సన్‌రైజర్స్ (4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 8వ స్థానం).. ఇవాళ (ఏప్రిల్‌ 15) టేబుల్‌ సెకెండ్‌ టాపర్‌ కేకేఆర్‌ను (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఢీకొట్టనుంది. ఈ ఆసక్తికర మ్యాచ్‌ ముంబైలోని బ్రబోర్న్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది రన్నరప్‌ కేకేఆర్‌ ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే, పంజాబ్‌, ముంబైలపై విజయాలు సాధించి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమిపాలవగా, ఎస్‌ఆర్‌హెచ్‌.. రాజస్థాన్‌, లక్నో జట్ల చేతిలో ఓడి చెన్నై, గుజరాత్‌ జట్లపై వరుస విజయాలు సాధించింది. 

ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌ పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇరు జట్లు ముఖాముఖి తలపడిన 21 సందర్భాల్లో కేకేఆర్‌ 14, ఆరెంజ్‌ ఆర్మీ 7 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. గత 4 మ్యాచ్‌ల్లో అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 2020 సీజన్‌ నుంచి ఆరెంజ్‌ ఆర్మీ కేకేఆర్‌పై ఒక్క మ్యాచ్‌ గెలిచింది లేదు. బలాబలాల ప్రకారం చూస్తే.. ప్రస్తుత సీజన్‌లోనూ కేకేఆర్‌ ఆరెంజ్‌ ఆర్మీ కంటే బలంగా కనిపిస్తుంది. శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రసెల్‌, పాట్‌ కమిన్స్‌, సునీల్‌ నరైన్‌ వంటి స్టార్లతో కేకేఆర్‌ పటిష్టంగా కనిపిస్తుండగా.. విలియమ్సన్‌, పూరన్‌, భువనేశ్వర్‌, అభిషేక్‌ శర్మ లాంటి ఆటగాళ్ల మెరుపులపై సన్‌రైజర్స్‌ ఆధారపడి ఉంది.    

చెరో మార్పుతో ఇరు జట్లు..
నేటి మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. గుజరాత్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సన్‌రైజర్స్‌ శ్రేయస్ గోపాల్‌ను బరిలోకి దించవచ్చు. కేకేఆర్‌.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోని రసిక్‌ సలామ్‌కు తప్పించి శివమ్‌ మావికి ఆడించవచ్చు.

ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, పూరన్, మార్క్రమ్‌, శ్రేయస్ గోపాల్, శశాంక్ సింగ్, జన్సెన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

కేకేఆర్‌ తుది జట్టు (అంచనా): రహానే, వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయస్‌, సామ్‌ బిల్లింగ్స్‌, నితీశ్‌ రాణా, రసెల్‌, నరైన్‌, కమిన్స్‌, ఉమేశ్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి
చదవండి: GT VS RR: హార్ధిక్‌ చేసిన ఆ పని వల్ల జరిగిన నష్టం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Advertisement
 
Advertisement
 
Advertisement