మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం.. కేవలం 28 బంతుల్లోనే! ఆసీస్‌ ఘన విజయం | Australia's Mitchell Marsh seals T20 series win in South Africa - Sakshi
Sakshi News home page

AUS vs SA: మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం.. కేవలం 28 బంతుల్లోనే! ఆసీస్‌ ఘన విజయం

Published Sat, Sep 2 2023 9:35 AM

Mitchell Marsh seals T20 series win in South Africa - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. డర్భన్‌​ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మార్‌క్రమ్‌(49) పరుగులతో రాణించగా.. బావుమా(35) పర్వాలేదనపించాడు. ఆసీస్‌ బౌలర్లలో అబాట్‌, ఈల్లీస్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బెహ్రెండోర్ఫ్ రెండు వికెట్లు సాధించారు.

మార్ష్‌, షార్ట్‌ విధ్వంసం..
ఇక 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ ఛేదించింది. మరోసారి ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా మార్ష్‌ తన హాఫ్‌సెంచరీ మార్క్‌ను కేవలం 28 బంతుల్లోనే అందకున్నాడు. అతడికి ఇది వరుసగా రెండో అర్ధ శతకం కావడం విశేషం.

 అతడితో పాటు ఓపెనర్‌ మాథ్యూ షార్ట్‌ కూడా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న షార్ట్‌ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. కాగా షార్ట్‌కు ఇది రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం గమనార్హం. ఇక ప్రోటీస్‌ బౌలర్లలో విలియమ్స్‌, షమ్సీ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది.
చదవండి: విరాట్‌ కోహ్లి అంటే నాకు గౌరవం.. అది అనవసరం! విజయం మాదే: బాబర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement