ఆ రోజు నిజంగానే నేను భయపడ్డాను.. సడన్‌గా వచ్చి: రోహిత్‌ | Rohit Sharma Reacts To Pitch Invasion During MI Vs RR, Says He Was A Little Scared - Sakshi
Sakshi News home page

Rohit Sharma: ఆ రోజు నిజంగానే నేను భయపడ్డాను.. సడన్‌గా వచ్చి

Published Thu, Apr 18 2024 9:45 PM

Rohit Sharma reacts to pitch invasion during MI vs RR - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మకు ఓ అభిమాని ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1న జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఫీల్డింగ్ చేస్తున్న‌ప్పుడు అభిమాని ఒకరు గ్రౌండ్‌లో దూసుకొచ్చి.. రోహిత్‌ను వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు.  

ఆ అభిమాని ద‌గ్గ‌ర‌కు రావ‌డం చూసిన రోహిత్ భ‌యంతో దూరం వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. అయినప్పటికి రోహిత్‌ అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతడిని గ్రౌండ్‌ నుంచి బయటకు పంపించారు. అయితే తాజాగా ఈ సంఘటనపై రోహిత్‌ స్పందించాడు.

"అతడు నా దగ్గరకు వచ్చి నేను నీకు మీకు పెద్ద అభిమానిని, నాకు హాగ్‌ కావాలని అని అన్నాడు. నేను అతడికి హత్తుకునే అవకాశమిచ్చాను. కానీ అభిమానులు ఎవరైనా మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలోకి రాకూడదు. ఎందుకంటే సెక్యూరిటీ కళ్లు గప్పి వస్తే కచ్చితంగా వారు చిక్కుల్లో పడతారు.

నేను స్లిప్‌లో ఉండి ఫీల్డ్‌ సెట్‌ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. అతడు మైదానంలోకి రావడాన్ని నేను గమనించలేదు. మిడ్-ఆఫ్‌లో నాకు ఎదురుగా నిలబడి ఉన్న టిమ్‌ డేవిడ్‌ సైగలు చేసి చెప్పాడు. అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ సమయంలో ఓ వ్యక్తి నా పక్కన వచ్చి  నిలబడ్డాడు. నిజంగానే నేను ఒక్కసారిగా భయపడ్డానని" రోహిత్‌ పేర్కొన్నాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement