
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ అరుదైన ఘనత సాధించాడు. 2014 తర్వాత ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రెండో అత్యంత పెద్ద వయస్కుడిగా గ్లీసన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ పైగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున డెబ్యూ చేసిన గ్లీసన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
గ్లీసన్ 36 ఏళ్ల 151 రోజుల వయస్సులో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఈ జాబితాలో తొలి స్ధానంలో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా ఉన్నాడు. రజా 36 ఏళ్ల 342 రోజుల వయస్సులో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.
ఇక ఐపీఎల్-2024కు దూరమైన డెవాన్ కాన్వే స్ధానాన్ని గ్లీసన్‌తో సీఎస్‌కే భర్తీ చేసింది. ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్ ముగిశాక గ్లీసన్ సీఎస్‌కే జట్టుతో చేరాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు మతీషా పతిరానా దూరం కావడంతో గ్లీసన్‌కు సీఎస్‌కే తుది జట్టులో ఛాన్స్ దక్కింది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్‌కే 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment