జొరావర్‌..నిన్ను చూసి ఏడాదవుతోంది : శిఖర్‌ ధావన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ | Sakshi
Sakshi News home page

జొరావర్‌..నిన్ను చూసి ఏడాదవుతోంది : శిఖర్‌ ధావన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Tue, Dec 26 2023 5:03 PM

Shikhar Dhawans Emotional Post On Son Zoravars Birthday - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన కెరీర్‌తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన ధావన్‌.. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపో​యి ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవలే ఢిల్లీలోని  ఫ్యామిలీ కోర్టు శిఖర్‌ దావన్‌, ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజారు చేసింది.

అప్పటి నుంచి తన కుమారుడు జొరావర్‌ను శిఖర్‌ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడి పుట్టిన సందర్భంగా ధావన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. జొరావర్‌కు బర్త్‌డే విషెస్​ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్‌ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం  జొరావర్‌ ఆస్ట్రేలియాలో అయేషాతో కలిసి ఉన్నాడు.

'నిన్ను నేరుగా చూసి ఏడాదవుతోంది. దాదాపు మూడు నెలలుగా  అన్ని చోట్లా (సోషల్ మీడియాలో) నన్ను బ్లాక్ చేశారు. నీ నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీతో వీడియో కాల్‌లో కూడా మాట్లాడి చాలా రోజులైంది. అందుకే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పాత ఫోటోనే పోస్ట్‌ చేస్తున్నాను.

హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ బాయ్‌. నేను నీతో నేరుగా మాట్లాడలేకపోయినా.. ఎల్లప్పుడూ టెలీపతి(కమ్యూనికేషన్‌) ద్వారా నేను నిన్ను కనెక్ట్ అవుతాను. నిన్ను చూసి గర్విస్తున్నా.. నువ్వు బాగున్నావని నాకు తెలుసు. ఈ నాన్న నిన్నెప్పుడూ మిస్సవుతాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ దేవుని దయతో మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను. లవ్‌ యూ జొరా ​అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఢిల్లీలోని  ఫ్యామిలీ కోర్టు ధావన్‌- అయేషా విడాకులు మంజూరు చేసింది. జనవరిలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్‌ విడాకుల పిటిషన్‌ ధాఖలు చేశాడు. అనంతరం తన భార్యపై ధావన్‌ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని విశ్వసించిన న్యాయస్దానం విడాకులు మంజూరు చేసింది.

ధావన్‌, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్‌కు భారత్‌ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్‌ ద్వారా కూడా ధావన్‌ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది.

Advertisement
Advertisement