Stuart Broad Becomes First England Bowler To Achieve 150 Ashes Wickets - Sakshi
Sakshi News home page

Stuart Broad: చరిత్ర సృష్టించిన స్టువర్ట్‌ బ్రాడ్‌.. తొలి ఇంగ్లండ్‌ బౌలర్‌గా

Published Fri, Jul 28 2023 9:22 PM

Stuart Broad Becomes First England Bowler To Achieve This Ashes Feat - Sakshi

ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్‌ చరిత్రలో ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన మొద‌టి ఇంగ్లండ్ బౌల‌ర్‌గా చరిత్ర సృష్టించాడు. సొంతగ‌డ్డ‌పై ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ యాషెస్ ఆఖ‌రి టెస్టులో అత‌ను ఈ మైలురాయిని  అందుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్‌ ఉస్మాన్ ఖ‌వాజా(47) ఎల్బీగా ఔట్ చేయ‌డం ద్వారా  ‍బ్రాడ్‌ ఈ ఘనత సాధించాడు.

ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్‌ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్‌ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్‌ బౌలర్‌గానూ బ్రాడ్‌ రికార్డులకెక్కాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో తడబడుతోంది. ఇంగ్లండ్‌ను తక్కువకు ఆలౌట్‌ చేశామన్న ఆనందం ఆసీస్‌ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్‌ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ కమిన్స్‌ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌, మార్క్‌వుడ్‌లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్‌, వోక్స్‌, జోరూట్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది.

చదవండి: Japan Open 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌.. సాత్విక్‌-చిరాగ్‌ జోడి ఓటమి


 

Advertisement
 
Advertisement
 
Advertisement