T20 World Cup 2024: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన శ్రీలంక.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: Sri Lanka Won The Toss And Choose Bat First Against South Africa | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన శ్రీలంక.. తుది జట్లు ఇవే..!

Published Mon, Jun 3 2024 8:00 PM | Last Updated on Mon, Jun 3 2024 8:12 PM

T20 World Cup 2024: Sri Lanka Won The Toss And Choose Bat First Against South Africa

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 3) సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్‌ హసరంగ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీకి శ్రీలంక జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించినప్పటికీ పేపర్‌పై పటిష్టంగా కనిపిస్తుంది. నేటి మ్యాచ్‌కు లంకేయులు ఏడుగురు బ్యాటర్లు, 4 బౌలర్ల ఫార్ములాతో బరిలోకి దిగుతున్నారు. 

మరోవైపు టోర్నీ హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన సౌతాఫ్రికా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అరివీర భయంకరంగా కనిపిస్తుంది. ఆ జట్టు ఆరుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. ప్రొటీస్‌ బౌలింగ్‌ విభాగంలో కేవలం ఒకే ఒక​ స్పిన్నర్‌ (కేశవ్‌ మహారాజ్‌) ఉన్నాడు.  

తుది జట్లు..
శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్‌), కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, వనిందు హసరంగ(కెప్టెన్‌), మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, నువాన్ తుషార

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement