టీమిండియాలో నో ఛాన్స్‌.. కథ ముగిసిందని అర్ధం కాదు! భారత సెలక్టర్లపై? | Umesh Yadavs Cryptic Instagram Story Viral After Being Snubbed From India Squad For England Tests - Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాలో నో ఛాన్స్‌.. కథ ముగిసిందని అర్ధం కాదు! భారత సెలక్టర్లపై?

Published Sun, Feb 11 2024 8:52 AM

Umesh Yadavs Instagram story viral after England Tests snub - Sakshi

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లకు కూడా టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి దూరమయ్యాడు.

కోహ్లితో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌గా వెన్ను గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు ఎవరూ ఊహించిన విధంగా సెలెక్టర్లు బెంగాల్‌ పేసర్‌ ఆకాష్‌ దీప్‌ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు.

ఉమేశ్‌కు మరోసారి నిరాశే..
ఇక ఇది ఇలా ఉండగా.. జట్టులో చోటు అశించిన వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నప్పటికి ఉమేశ్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఉమేశ్‌ యాదవ్‌ సెలెక్టర్లపై పరోక్షంగా స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ స్టోరీని ఉమేశ్‌ పోస్టు చేశాడు. ‘పుస్తకాలపై దుమ్ము పట్టినంత మాత్రాన కథ ముగిసిందని అర్థం కాదు’ అంటూ రాసుకొచ్చాడు.

యాదవ్‌ చివరగా భారత తరపున గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌పై ఆడాడు. అయితే ఉమేశ్‌కు టెస్టుల్లో భారత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది. స్వదేశంలో 2018 తర్వాత కేవలం 11 టెస్టులే ఆడిన యాదవ్‌ 43 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 57 టెస్టుల్లో 170 వికెట్లు ఉమేశ్‌ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహద్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

Advertisement
Advertisement