మంచు విష్ణు ప్రాజెక్ట్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో తెలుసా? | Another Star Heroine Joins In Manchu Vishnu Kannappa MovieTeam | Sakshi
Sakshi News home page

Kannappa Movie: కన్నప్పలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే?

Published Fri, May 17 2024 6:29 PM | Last Updated on Fri, May 17 2024 7:01 PM

Another Star Heroine Joins In Manchu Vishnu Kannappa MovieTeam

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం నటిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సైతం కన్నప్ప సెట్స్‌లో సందడి చేశారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ నటించనుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కన్నప్ప చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఇటీవలే అక్షయ్‌కుమార్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్‌ చేయనున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement