విద్యుత్‌ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్‌ చేసి ప్రాణం పోసిన డాక్టర్‌ | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్‌ చేసి ప్రాణం పోసిన డాక్టర్‌

Published Fri, May 17 2024 3:40 PM

Doctor Saves Boy Lifes With CPR In Vijayawada

విజయవాడ:   ఓ మహిళా డాక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్‌

వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.  దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్‌ రవళి ఆ ఘటనను చూశారు.  

ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె..  ఉన్నపళంగా సీపీఆర్‌ చేశారు.  కొన్ని నిమిషాల పాటు సీపీఆర్‌ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్‌ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement