సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్‌! | Buzz: Sukumar Plan To Change Pushpa 2 Movie Climax | Sakshi
Sakshi News home page

సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్‌!

Jun 1 2024 5:46 PM | Updated on Jun 1 2024 6:49 PM

Buzz: Sukumar Plan To Change Pushpa 2 Movie Climax

ఆగస్ట్‌ 15.. బన్నీ ఫ్యాన్స్‌కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్‌ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్‌ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్‌ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్‌ సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని భావిస్తున్నాడట.

సాధారణంగా సుకుమార్‌ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ప్లాన్‌ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్‌ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా వేరేది యాడ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్‌ కూడా పార్ట్‌ 3కి సెట్‌ అయ్యేలా ప్లాన్‌ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్‌ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్‌ అయిన వాటి నుంచి బెస్ట్‌ క్లైమాక్స్‌ని యాడ్‌ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్‌ టెన్షపడుతున్నారట. 

ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్‌ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి.  ఇలాంటి తరుణంలో క్లైమాక్స్‌ చేంజ్‌ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement