తుపాకీ ‘గురి’ తప్పుతోంది!  | Sakshi
Sakshi News home page

తుపాకీ ‘గురి’ తప్పుతోంది! 

Published Wed, Aug 23 2023 2:16 AM

Deaths in the armed forces are causing concern in the country - Sakshi

ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు.

విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? 


సాక్షి, హైదరాబాద్‌ :ఇటీవల జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ టికారామ్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్‌ బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్‌ సైఫుద్దీన్‌ ఉన్నారు.

సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్‌ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది.


13 ఏళ్లలో 1,532 మంది.. 
♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్, సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని...  
♦ జనగాం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌ గత ఏప్రిల్‌ 6న తన సర్విస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్‌ భార్య స్వరూప బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
♦ 2016లో ఆదిలాబాద్‌ జిల్లా కెరిమెరిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ తన సర్విస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
  
♦ 2019లో హెడ్‌ కానిస్టేబుల్‌ డి.ప్రకాశ్‌ రెడ్డి తన పైఅధికారి సర్విస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. 

 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టే బుల్‌ రూపేషానంద్‌ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

♦ 2020 నవంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ బ్యాంక్‌ వద్ద గార్డ్‌ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
  
 2017 జూన్‌లో సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రెడ్డి తన సర్విస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ నివేదికలో ఏముంది? 
 సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్‌్కఫోర్స్‌ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్‌–వ ర్కింగ్‌ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది.

శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. 
పోలీస్‌ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్‌ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి.

ఇప్పుడు కూడా పోలీస్‌ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక  శిక్షణ అవసరం.

మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం.  – నారాయణ, రిటైర్డ్‌ ఎస్పీ


కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ నివేదికలో ఏముందంటే... 
♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం.

పోలీస్‌ సెన్సిటివిటీ ట్రైనింగ్‌ సైతం అవసరం 
♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్‌ సెన్సిటివిటీ ట్రైనింగ్‌ ఇవ్వడం ఎంతో ముఖ్యం.

నేను తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి.   – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్‌

 
Advertisement
 
Advertisement