ఆరణిని అనర్హుడిగా ప్రకటించండి | Sakshi
Sakshi News home page

ఆరణిని అనర్హుడిగా ప్రకటించండి

Published Tue, May 7 2024 10:05 AM

ఆరణిని అనర్హుడిగా ప్రకటించండి

తిరుపతి లీగల్‌: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులును అనర్హుడిగా ప్రకటించాలని అధికారులకు ఫిర్యాదుచేసినట్టు వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మునిబాల సుబ్రమణ్యం (దొరబాబు) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి తిరుపతి సంజయ్‌ గాంధీ కాలనీలోని మదీనా మసీదులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని, అలాగే తన కార్యకర్తలను ఇందుకు ప్రోత్సహించి, ప్రేరేపించిన ఆ పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును ఎన్నికల్లో పోటీనుంచి తప్పించి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు దొరబాబు తెలిపారు. ఆరణి శ్రీనివాసులు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు రోజు రోజుకీ శ్రుతి మించుతున్నాయని దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు తాను తిరుపతి శాసనసభ రిటర్నింగ్‌ అధికారిణికి, జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement