పెళ్లితో సంబంధం లేకుండా పెన్షన్
వికలాంగ పిల్లల పెన్షన్‌పై ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
సాక్షి, అమరావతి: మానసిక, అంగ వైకల్యం గల కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్‌ను పెళ్లితో సంబంధం లేకుండా మంజూరు చేయనున్నారు. గతంలో కుటుంబ పెన్షన్‌ను పెళ్లయ్యాకనే ఇచ్చేవారు.కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబ పెన్షన్ నిబంధనల్లో సవరణలు తీసుకురావాలని నిర్ణరుుంచాయి.
ప్రభుత్వ ఉద్యోగి అంగ వైకల్యం లేదా, మానసిక వైకల్యం గల కుమారుడు, కుమార్తెకు పెళ్లితో సంబంధం లేకుండానే కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.