ఎస్ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి | YSRCP Leader Died After SI Slapped in prakasam district | Sakshi
Sakshi News home page

ఎస్ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి

Published Tue, Jul 1 2014 9:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

ఎస్ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి

ఎస్ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి

గిద్దలూరు : ఎస్ఐ దురుసు ప్రవర్తన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఓ వివాదం విషయమై పోలీస్ స్టేషన్కు వెళ్లిన  ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేత, గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు వైజా విజయ భాస్కర్‌రెడ్డి (48)పై ఎస్ఐ శ్రీనివాసరావు దాడి చేయటంతో ఆయన అక్కడికక్కడే గుండెపోటుతో మరణించారు.  స్థానిక హీరో హోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు, డీఆర్ఆర్ ప్లాజా నివాసి డాక్టర్ హరినాథ్ రెడ్డి మధ్య ఓ విషయమై ఘర్షణ తలెత్తింది. దాంతో ఈ విషయమై ఇరువురు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి భార్యతో ఎస్ఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న వైజా విజయ భాస్కర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకుని ఎస్ఐ ప్రవర్తను ఖండించారు. దాంతో ఆగ్రహించిన ఎస్ఐ ...భావిజయ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసి చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో   స్థానిక ఆస్పత్రికి తరలించే లోపే గుండెపోటుతో మృతి చెందారు.

 

ఈ సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో జరిగింది.  విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అర్థరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విజయ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మృతితో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement