చౌక ధరలకే ఇల్లు సొంతం చేసుకోండి.. | Sakshi
Sakshi News home page

చౌక ధరలకే ఇల్లు సొంతం చేసుకోండి..

Published Tue, Feb 16 2016 10:08 PM

చౌక ధరలకే ఇల్లు సొంతం చేసుకోండి..

అద్దె ఇంట్లో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడేవారెవరైనా సొంత ఇల్లు తమకు కలగానే భావిస్తారు. చిన్న పొదరిల్లైనా చాలు సొంతగా తమకు ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ సభ్యులు బంగారు అవకాశం కల్పిస్తున్నారు. కేవలం 15 వేల యూరోలకు(భారత కరెన్సీలో దాదాపు 11.45 లక్షల రూపాయలు) ఫ్లాట్ మీ సొంతం చేసుకోండంటూ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. కారు పార్కింగ్ తో సహా అనేక వసతులున్న ఆ ఇళ్ళ వివరాలేంటో ఓసారి చూద్దాం.

చాలా తక్కువ ధర ఉన్న ఫ్లాట్ మీ సొంతం చేసుకోండంటూ బ్రిటన్ బేరగాళ్ళు  ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తున్నారు. లక్షల యూరోలు పోసి కొనలేని మధ్య తరగతి వారికోసం అక్కడి ఏజెంట్లు ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు. కొత్త పద్ధతిలో ఇళ్ల అమ్మకాలు చేపట్టి చౌక ధరకే అందిస్తున్నారు. చైకైన ఇంటికోసం వెతుక్కునేవారికి ఆ కష్టాలు లేకుండా.. పార్కింగ్ స్థలంతో పాటు... సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ ను కేవలం 15000 యూరోలకే అందిస్తున్నారు. సగటు వివాహ ఖర్చుకంటే కూడ తక్కువ ధరకు వారు ఇళ్లను ట్యాగ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. లండన్ లాంక్ షైర్ ప్రెస్టన్ ప్రాంతంలో మధ్య తరగతి వారికోసం ఈ నూతన ప్రక్రియను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇటువంటి 24 ఇళ్లను పలు ప్రాంతాల్లో గుర్తించి ఇప్పుడు ఆన్ లైన్ ఎస్టేట్ ఏజెంట్లు ఒక్కోటి అమ్మకానికి పెట్టారు. మాల్దీవులకు ఓసారి వెళ్ళి వస్తే అయ్యేంత ఖర్చుతో నాలుగు సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లు సొంతం చేసుకోవచ్చని హౌస్ సింపుల్ డాట్ కామ్ కు చెందిన ఆన్ లైన్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు.  

లండన్ లో ఓ కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలంటే కనీసం 31000 యూరోలు(భారత కరెన్సీలో దాదాపు 22.5 లక్షల రూపాయలు) ఖర్చవుతుందని, అయితే అందులో కేవలం సగం కట్టినా ఈ  సింగిల్ బెడ్ ఫ్లాట్.. పార్కింగ్ తో సహా సొంతం చేసుకునే అవకాశం ఉందని ఆన్ లైన్ ఏజెంట్లు వివరిస్తున్నారు. తక్కువ ధరలో ఇళ్లను గుర్తించేందుకు సంస్థ సభ్యులు బ్రిటన్ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించారు. అందులో భాగంగా అక్కడి కనీస గృహాల ఖరీదు 300.000 యూరోలు ఉన్నట్లుగా తెలుసుకున్నారు.

అందుకే మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు వారు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత చౌక అయిన ఇళ్లను గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వసతులతో ఉన్నా... ఈ చిన్న ఇల్లు నివాసానికి సరిపోదని ఫీలయ్యేవారు పెట్టుబడిగానైనా కొనొచ్చని సలహా ఇస్తున్నారు. ఆన్ లైన్ బ్రోకర్లు, ఏజెంట్లు ప్రతిచోటా ఉన్నా వారికి దొరికిన ఇళ్లు మాత్రమే అమ్మకానికి పెడుతుంటారు. కానీ బ్రిటన్ బేరగాళ్లు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఎంపిక చేసి మరీ ఇళ్లను అమ్మకానికి పెట్టడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంటోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement