రెట్టింపు ఆనందం! | Sakshi
Sakshi News home page

రెట్టింపు ఆనందం!

Published Mon, Aug 11 2014 11:55 PM

రెట్టింపు ఆనందం!

తమిళ హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. నటుడిగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇక, ‘కొలవెరి..’ పాటను తనదైన శైలిలో పాడి గాయకునిగా కూడా ఎంత ప్రసిద్ధి పొందారో తెలిసిందే. కేవలం తన చిత్రాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోల చిత్రాలకు కూడా పాటలు పాడుతుంటారు ధనుష్. అడపా దడపా గేయ రచయితగా కూడా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తన సతీమణి ఐశ్యర్యా ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ‘వై రాజా వై’ చిత్రం కోసం ధనుష్ ఓ పాట రాశారు. ఈ పాటను సంగీతజ్ఞాని ఇళయరాజా పాడారు. ‘‘పాట రాసినప్పుడు కలిగిన ఆనందంకన్నా ఈ పాటను ఇళయరాజా స్వరంలో వింటున్నప్పుడు కలిగిన ఆనందం రెట్టింపు’’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ధనుష్. మరో రెండు రోజుల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement