ప్రేమ విషయంలో ఇప్పటికే ఓడిపోయాను | Sakshi
Sakshi News home page

ప్రేమ విషయంలో ఇప్పటికే ఓడిపోయాను

Published Tue, Dec 23 2014 2:19 AM

ప్రేమ విషయంలో ఇప్పటికే  ఓడిపోయాను

 ప్రేమలో ఒక్కసారి ఓడింది చాలు. మరోసారి ఆ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాలనుకోవడం లేదంటున్నారు రాయ్‌లక్ష్మి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీకి అవకాశాలు అంతగా లేవు. ఆ మధ్య అధర్వ హీరోగా నటించిన ఇరుబుంబకుదిరై చిత్రంలో ఆయనకు స్నేహితురాలిగా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర పోషించారు. అంతేకాదు ఆ చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసినప్పటికీ చిత్రం పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇటీవల హిట్ చిత్రం అరణ్మణైలో ఉన్నాననిపించుకున్నారంతే. ప్రస్తుతం ఒక చిత్రం కోసం బాగా శరీర కసరత్తులు చేస్తున్నారట. ప్రస్తుతానికి ప్రేమా గీమా జాన్తా నై అంటున్న రాయ్ లక్ష్మి ఇంకా ఏం చెబుతోందంటే...
 
 నూతన చిత్రం కోసం మూడు నెలలుగా ఏకధాటిగా జిమ్నాస్టిక్ నేర్చుకుంటున్నా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు షిప్టుల ప్రకారం శిక్షణా తరగతులకు హాజరవుతున్నాను. దీంతో ఇంతకుముందుకు ఎలా ఉన్నానో, ఇప్పడు ఎలా ఉన్నాన్నో పోల్చుకుని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తోంది. ప్రేమ, పెళ్లి గురించి అడుగుతున్నారు, ప్రేమ విషయంలో ఇప్పటికే ఒకసారి ఓడిపోయాను, మళ్లీ అలాంటి చేదు అనుభవాన్ని చవి చూడదలచుకోలేదు. ప్రస్తుతం తాను ప్రేమిస్తోంది సినిమాను మాత్రమే. ఈ రంగంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయ్యింది. ఇకపై ప్రేమ కోసం దేన్ని కోల్పోదలచుకోలేదు అని చెబుతోంది రాయ్‌లక్ష్మి.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement