కారు బోల్తా: ఇద్దరు మెడికోలు మృతి | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఇద్దరు మెడికోలు మృతి

Published Thu, Jul 3 2014 2:42 PM

Two dental college students die as their car capsize

కారు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తమిళనాడులోని తంజావూర్ సమీపంలో పుదుక్కుడిలో గురువారం చోటు చేసుకుంది. మృతులు మహ్మమద్ నియాజ్ (21), దివ్య భారతి (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

క్షతగాత్రులను తిరుచినాపల్లిలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్నవారంతా చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో డెంటల్ కోర్స్ అభ్యసిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థులంతా పట్టుకొటాయి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement