-
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
జియోకు భారీగా షాకిస్తున్నారు!
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్చి వరకు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియో ఇక టారిఫ్ బాదుడు ప్రారంభించింది. అప్పటిదాక జియో వైపు మొగ్గుచూపిన కస్టమర్లందరూ ఆ నెట్ వర్క్ కు భారీగా షాకిస్తూ ఇతర నెట్ వర్క్ లవైపుకు మరలడం ప్రారంభించారట. అంతేకాక తగ్గుతున్న రేట్ల ఛార్జీలు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియోకు మరలిన డేటా కస్టమర్లందరూ ఇప్పటికే భారీగా తమ నెట్ వర్క్ వైపుకు వచ్చేస్తున్నారంటూ టెలికాం దిగ్గజం ఐడియా సెల్యులార్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో 2017లో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కుతామని ఐడియా అంచనావేస్తోంది. ఛార్జీలు బాదుడు ప్రారంభించిన తర్వాత నుంచే డేటా కస్టమర్లందరూ జియో నెట్ వర్క్ కు గుడ్ బై చెబుతున్నారంటూ ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా చెప్పారు. ద్వితీయార్థంలో రేట్లు స్థిరీకరణ జరుగుతుందని ఆయన అంచనావేశారు. '' ఇండస్ట్రీకి, తమకు ఈ రెవెన్యూ వృద్ధిని మేము ముందే అంచనావేశాం. ఏడాది బేసిస్ తో స్వల్ప వృద్ధితో ఇండస్ట్రీ ఫ్లాట్ గా ఉంటుందని అనుకున్నాం. 2017 క్యూ 4 నష్టాల నుంచి ఇండస్ట్రీ వచ్చే ఏడాది క్యూ 4 వరకు 15 శాతం రికవరీ అవుతుంది'' అని పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2017 ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 14-15 శాతం నష్టపోయినట్టు తెలిపారు. మార్కెట్లోకి సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోకు 75 మిలియన్ కస్టమర్లు చేరడం, మూడు టాప్ టెలికాం దిగ్గజాలకు నష్టాలు చేకూర్చడం స్వల్పమేనని, తాము సబ్ స్క్రైబర్లు జోడించుకుంటూనే ఉన్నామని కపానియా చెప్పారు. వాయిస్ వాడక వృద్ధి రెండంకెలు నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు తెలిపారు. డేటా వృద్ధిలో రెండంకెలు, వైర్ లెస్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో మూడింతలు వృద్ధిని నమోదుచేసే దిశగా ఇండస్ట్రీ పయనిస్తుందని పేర్కొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
ఓటేసిన రాష్ట్రపతి.. ఆరో విడతలో ఇతర ప్రముఖులు (ఫొటోలు)
ఉక్రెయిన్‌కు మరో విడత అమెరికా మిలటరీ సాయం
SRH vs RR: ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్
Breast cancer బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించాలి!
అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
పుణె పోర్షే కేసు : తాత అరెస్ట్
ఢీల్లీలో కొనసాగుతున్న పోలింగ్
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
తప్పక చదవండి
- ఛత్తీస్‌గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- రేపు జేఈఈ అడ్వాన్స్డ్
- చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Advertisement