-
ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్
'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రసారం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతికి అనుమతి లేదని కూడా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ మీడియా సంస్ధతో ఆయన ఇలా మాట్లాడారు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) 'ఆమెకు (రమ్య రఘుపతి) చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వస్తున్నారు. ఇది మా కుటుంబంలోని సభ్యులకు (తల్లి వైపు) కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము కోర్టు రక్షణను కోరాము. ఇప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించకూడదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.' అని నరేష్ తెలిపారు. అంతే కాకుండా నరేష్, రమ్య ఇద్దరూ విడిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తామిద్దరం కలిసి జీవించడం లేదని కోర్టు కూడా నిర్ధారించిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమ విడాకులకు మార్గం సుగమం అయిందన్నారు. అందుకు సంబంధించి తాను ఇప్పటికే కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపిన నరేష్ ఈ తీర్పు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు) ఈ ఏడాది ప్రారంభంలో రమ్య నుంచి విడాకుల కోరుతూ కూకట్పల్లి కోర్టులో తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి తన చుట్టు ఎన్నో వివాదాలు వచ్చాయని నరేష్ ఇలా తెలిపారు. 'నేను, పవిత్ర లోకేష్‌తో కలిసి వుండటాన్ని కొంతమంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఊహాగానాలు చేస్తుంటే, నేను ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇకనుంచి అయినా నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి ఈ కేసు వల్ల విడాకుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.' అని నరేష్ అన్నారు. -
ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు
మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్ తగిలింది. మెరిట్ లేని కారణంగా బుధవారం నాడు కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేసింది. సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదు సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని న్యాయస్థానం నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ తీర్పు ప్రకారం సినిమాను ఎక్కడైనా నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేయవచ్చు. నరేశ్ ఇంట్లో ప్రవేశానికి రమ్యపై నిషేధం మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది. ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 సంవత్సరాలుగా విడివిడిగా జీవనం ఇకపోతే నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు.. నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. కాగా రమ్య రఘుపతి.. నరేష్‌పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు .. రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్‌కు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉంది. చదవండి: రామ్‌చరణ్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement